Begin typing your search above and press return to search.

హాట్ యాంక‌ర్ సిల్క్ స్మితగా డ‌ర్టీపిక్చ‌ర్ కి సిద్ధ‌మా?

By:  Tupaki Desk   |   9 Dec 2020 10:01 AM GMT
హాట్ యాంక‌ర్ సిల్క్ స్మితగా డ‌ర్టీపిక్చ‌ర్ కి సిద్ధ‌మా?
X
రంగ‌స్థ‌లం రంగ‌మ్మ‌త్త‌గా కుర్రకారు హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయింది హాట్ యాంక‌ర్ అన‌సూయ‌. జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ గా త‌న‌కు ద‌క్కిన పాపులారిటీని అన‌సూయ ఎక్క‌డా మిస్ యూజ్ చేయ‌లేదు. సోగ్గాడే చిన్ని నాయ‌నా మొద‌లు వ‌ర‌స‌గా ప‌లు క్రేజీ చిత్రాల‌కు సంత‌కం చేసిన అన‌సూయ వెండితెర అభిన‌యంలో వెనుతిరిగి చూసిందే లేదు. వైయ‌స్సార్ బ‌యోపిక్ యాత్ర‌లోనూ కీల‌క పాత్ర‌ను పోషించిన అన‌సూయ క‌థ‌నం చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించి ఆక‌ట్టుకున్నారు.

ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ చిత్రాల్లో అన‌సూయ న‌టిస్తోంది. ఈసారి కాస్తంత హాట్ కంటెంట్ తో యువ హృద‌యాల్లో బౌన్స‌ర్ వేసేందుకు అన‌సూయ రెడీ అవుతుండ‌డంతో ఇటు తెలుగు ప్రేక్ష‌కులు అటు త‌మిళ ప్రేక్ష‌కుల్లోనూ ఆస‌క్తి నెల‌కొంది. ఇంత‌కీ ఏ సినిమా అది? ఎలాంటి పాత్ర‌లో? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

ఏలూరుకు చెందిన విజ‌య‌ల‌క్ష్మి అలియాస్ సిల్క్ స్మిత‌గా బోల్డ్ పాత్ర‌లో స‌ర్ ప్రైజ్ ఏయ‌బోతోంది అన‌సూయ‌. తాజాగా అందుకు సంబంధించిన గెట‌ప్ ని సోష‌ల్ మీడియాల్లో త‌నే స్వ‌యంగా రివీల్ చేయ‌డంతో బోయ్స్ లో అది కాస్తా వైర‌ల్ గా మారింది. అన‌సూయను నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ అవ‌తార్ లో చూడ‌బోతున్నామ‌న్న ఉత్సాహం అభిమానుల్లో నెల‌కొంది. ఇక ఇటీవ‌లే త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి సినిమాకి క‌మిటైన అన‌సూయ ఆ చిత్రంలో ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తున్నారో వెల్ల‌డించ‌క‌పోవ‌డంతో దీనిపై బోలెడంత స‌స్పెన్స్ నెల‌కొంది. తాజా ఫోటోల్ని బ‌ట్టి ఇది సౌత్ ఐటెమ్ గాళ్ సిల్క్ స్మిత పాత్ర అని గెస్ చేస్తున్నారు. అయితే దీనిపై అన‌సూయ‌ అధికారికంగా ఏదీ చెప్ప‌లేదు.

రంగ‌మ్మ‌త్త కెరీర్ లో మ‌రో ఛాలెంజింగ్ రోల్ చేస్తోంద‌ని మాత్రం అభిమానుల‌కు అర్థ‌మ‌వుతోంది. త‌మిళ సినిమా ఆన్ లొకేష‌న్ రిలాక్స్ డ్ గా కుర్చీలో కూచుని ఫోన్ లో త‌థేకంగా చూస్తున్న అన‌సూయ ఫోటో ఒక‌టి వైర‌ల్ గా మారింది. ఒక‌వేళ సిల్క్ పాత్ర‌నే అయితే ది డర్టీ పిక్చ‌ర్ లో విద్యాబాల‌న్ ని మించి చెల‌రేగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహ‌మేం లేదు. దాదాపు 200పైగా తెలుగు- తమిళ- మళయాళ- కన్నడ చిత్రాలలో నటించిన సిల్క్ స్మిత.. అనేక సినిమాలలో ప్రత్యేక గీతాల్లో న‌ర్తించింది. శృంగార ర‌స నృత్యాల‌తో రంజింప‌జేయ‌డం లో సిల్కుని కొట్టేవాళ్లే లేర‌న్న గుర్తింపు ద‌క్కింది. హాటెస్ట్ బోల్డెస్ట్ స్టార్ గా అవ‌త‌రించిన సిల్క్ స్మిత క‌థ‌తో బాలీవుడ్ నిర్మాత‌లు కాసులు కొల్ల‌గొట్టారు. అయితే సౌత్ లో మాత్రం సిల్క్ జీవిత‌క‌థ‌ను సినిమాగా తీసే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సేతు‌పతి ఈసారి అలాంటి ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అన్న చ‌ర్చా సాగుతోంది. ఈ సినిమాతో పాటు రవితేజ ‘ఖిలాడి’.. కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ చిత్రాల్లోనూ అన‌సూయ న‌టిస్తోంది. అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో ‘థ్యాంక్యూ బ్రదర్‌’ త్వ‌ర‌లో విడుదల కానుంది.