Begin typing your search above and press return to search.

రీఎంట్రీ డేట్ చెప్పేసి ఊరిస్తోన్న అన‌సూయ‌!

By:  Tupaki Desk   |   9 March 2018 4:31 PM IST
రీఎంట్రీ డేట్ చెప్పేసి ఊరిస్తోన్న అన‌సూయ‌!
X
యాంక‌ర్ కు ఎక్కువ‌.. హీరోయిన్ కి కాస్త త‌క్కువ‌గా త‌న‌ను తాను ఫీల‌య్యే బుల్లితెర యాంక‌ర్ అన‌సూయ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. అందం కొంచెమే అయినా.. గ్లామ‌ర్ తో ఎలా పాపుల‌ర్ కావాలో ఈ ఆంటీకి తెలిసినంత బాగా మ‌రెవ‌రికి తెలీద‌ని చెప్పాలి. ముద్దు ముద్దుగా మాట్లాడ‌టం.. గారాలు పోవ‌టం.. అమాయ‌కంగా క‌నిపించ‌టం లాంటి చిన్నెల‌తో బుల్లితెర మీద కోట్లాది మంది మ‌న‌సుల్ని దోచేసిన అన‌సూయ‌.. రియ‌ల్ లైఫ్ లో మాత్రం చాలా సీరియ‌స్ అన్న విష‌యాన్ని ఆ మ‌ధ్య జ‌రిగిన ఒక ఘ‌ట‌న‌లో చెప్పక‌నే చెప్పేశారు.

బుల్లితెర మీద త‌న‌నెన్ని మాట‌ల‌న్నా.. నోరు నన్ను ఇన్ని మాట‌లు అంటారా అంటూ బిల్డ‌ప్ ఇచ్చే అన‌సూయ‌.. మ‌రీ అంత అమాయ‌కంగా ఉండ‌ర‌ని.. చిన్న పిల్లాడి విష‌యంలో అయినా య‌మాసీరియ‌స్ గా ఉంటార‌న్న విషయం ఆ మ‌ధ్య‌న ఫ్రూవ్ అయ్యింది. స్కూల్‌కు వెళ్లే పిల్లాడు త‌న‌ను చూసినంత‌నే ఆనందంతో ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి.. త‌న త‌ల్లి సెల్ ఫోన్ తో ఫోటో తీసుకోవ‌టం అన‌సూయ భ‌ర‌ద్వాజ్ కు య‌మా కోపం తెప్పించేసింది.

చిన్న‌పిల్లాడి మీద ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ.. సెల్ తీసుకొని రోడ్డు మీద‌కు విసిరి కొట్టి త‌న దారిన తాను వెళ్లిపోయింది. ఈ వ్య‌వ‌హారం మీడియాలోరావ‌టం.. పోలీసు ఫిర్యాదు కావ‌టంతో సోష‌ల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ రియాక్ష‌న్ ను ఏ మాత్రం ఊహించ‌లేదో ఏమో కానీ అన‌సూయ అప్ సెట్ అయ్యింది.

అంతే.. అప్ప‌టివ‌ర‌కూ య‌మా యాక్టివ్ గా ఉండే సోష‌ల్ మీడియాకు తాను దూరంగా ఉండ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించేసింది. త‌న ట్విట్ట‌ర్.. ఫేస్ బుక్ అకౌంట్ల‌ను డియాక్టివేట్ చేసి సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. అప్ప‌టి నుంచి అలానే ఉన్నా ఆమె.. తాజాగా ఒక తీపిక‌బురు చెప్పారు. రంగ‌స్థ‌లం సినిమా రిలీజ్ త‌ర్వాత మ‌ళ్లీ తాను సోష‌ల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు.

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఓ వెబ్ సైట్ ఫేస్ బుక్ లైవ్ లో అభిమానుల‌తో ముచ్చ‌టించిన ఆమె.. సోష‌ల్ మీడియాలోకి ఎప్పుడు వ‌స్తార‌న్న అభిమానుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా రంగ‌స్థ‌లం మూవీ రిలీజ్ త‌ర్వాత అని చెప్పేసింది.

తాను సోష‌ల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉండాల్సి వ‌చ్చింద‌న్న విషయంపై వివ‌ర‌ణ ఇచ్చిన ఆమె.. ఒక ఆస‌క్తిక‌ర అంశాన్ని ప్ర‌స్తావించారు. తన‌ది వెన‌క‌డుగు వేసే మ‌న‌స్త‌త్వం కాద‌ని.. కానీ కుటుంబ స‌భ్యులు ఇబ్బంది ప‌డ‌టం త‌ట్టుకోలేక‌పోయాన‌న్నారు. కొడుకులు పెద్ద‌వాళ్లు అవుతున్నార‌ని.. పేరెంట్స్ వ‌య‌సు కూడా పెరుగుతుంద‌ని.. త‌న‌కున్న ఓపిక వారికి ఉండ‌క‌పోవ‌చ్చు క‌దా? అని ఆమె చెప్పారు. నిజ‌మే.. అన‌సూయ చెప్పిన మాట‌ల్లో వాస్తవం లేక‌పోలేదు. అంద‌రి స‌హ‌నం గురించి మాట్లాడే ఆమె.. త‌న‌కు తాను ఎందుకు స‌హ‌నంగా ఉండ‌న‌ట్లు? ఆమె గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏమిటంటే.. త‌న‌ను ఒక సెక్ష‌న్ మీడియా త‌న‌ను తిట్టేసింద‌ని తెగ ఫీల‌య్యే ఆమె.. పిల్లాడి విష‌యంలో ఆమె చేసింది త‌ప్పు కాబ‌ట్టే కానీ.. మిగిలిన రోజుల్లో ఆమె త‌ప్పుల్ని ఎప్పుడు ఎత్తి చూపింది లేదు క‌దా. అలాంట‌ప్పుడు అన‌వ‌స‌రంగా హ‌ర్ట్ అయ్యే బ‌దులు.. పాజిటివ్ గా ఉంటే అంతా బాగుంటుంది క‌దా. ఎనీహో.. రీఎంట్రీకి స్వాగ‌తం అన‌సూయ‌.