Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్ 5' లోకి అనసూయ ఈ రూపంలో..!

By:  Tupaki Desk   |   6 July 2021 7:30 AM GMT
బిగ్ బాస్ 5 లోకి అనసూయ ఈ రూపంలో..!
X
తెలుగు బుల్లితెర పై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న రియాలిటీ షో ''బిగ్ బాస్''. హిందీ, తమిళం‌, కన్నడం, మలయాళం.. ఇలా అన్ని ప్రధాన భాషల్లోనూ ప్రజాదరణ పొందిన ఈ షో తెలుగులోనూ సత్తా చాటింది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా నాలుగు సీజన్లు పూర్తి చేసుకొని, 5వ సీజన్ కోసం సన్నాహాలు జరుపుకుంటోంది. ఇప్పటికే స్టార్ట్ కావాల్సిన ఈ సీజన్ కరోనా ప్రభావంతో ఆలస్యమైంది. పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్ట్ నెలాఖరున 'బిగ్ బాస్ 5' ను ప్రారంభించాలని 'స్టార్ మా' బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో 'బిగ్ బాస్ 5' కోసం 'స్టార్ మా' వాళ్ళు ఇప్పటికే కంటెస్టెంట్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ ను అందించడంతో పాటుగా మరింత గ్లామర్ ని కూడా యాడ్ చేయాలని నిర్వాహకులు ప్రణాళికలు రెడీ చేస్తున్నారట. ఈ క్రమంలో టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీస్ ని సంప్రదిస్తున్నారట. ఇదే క్రమంలో ఈసారి 'బిగ్ బాస్' కు కొత్తదనం తీసుకురావడానికి లైమ్ లైట్ లో ఉన్న ఫీమేల్ యాంకర్స్ ని కొన్ని ఎపిసోడ్స్ లో ఎంట్రీ ఇప్పించాలని చూస్తున్నారట.

తెలుగు బుల్లితెర పై హవా కొనసాగిస్తున్న యాంకర్ అనసూయ ను తెలుగు 'బిగ్ బాస్ 5' కోసం తీసుకురావాలని నిర్వాహకులు ఆలోచన చేస్తున్నారట. ఒకవైపు స్మాల్ స్క్రీన్ పై షోలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా సిల్వర్ స్క్రీన్ పై అందాలు ఆరబోస్తున్న అనసూయ.. 'బిగ్ బాస్ 5' లోకి వస్తే మాత్రం షోకు మరింత ఆదరణ దక్కే అవకాశం ఉంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో దీని గురించే చర్చలు జరుగుతున్నాయి.

అలానే 'బిగ్ బాస్' ఐదవ సీజన్ కు ఎవరు హోస్ట్ గా చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. గత రెండు సీజన్లను విజయవంతంగా నడిపించిన 'కింగ్' అక్కినేని నాగార్జున ఈసారి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే నాగ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో దగ్గుబాటి రానా 'బిగ్ బాస్ -5' కు హోస్టింగ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై నిర్వాహకులు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.