Begin typing your search above and press return to search.

లావెండ‌ర్ ల‌వ్ బ‌గ్ కుట్టింద‌న్న అన‌సూయ‌

By:  Tupaki Desk   |   14 May 2021 9:00 AM IST
లావెండ‌ర్ ల‌వ్ బ‌గ్ కుట్టింద‌న్న అన‌సూయ‌
X
ఇటీవ‌లి కాలంలో గ్లామ‌ర‌స్ యాంక‌ర్ అన‌సూయ వ‌రుస ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. రంగ‌స్థ‌లం రంగ‌మ్మ‌త్త‌గా త‌న పేరు మార్మోగాక ఇండ‌స్ట్రీలో ప‌లు క్రేజీ ఆఫ‌ర్ల‌తో అన‌సూయ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ క్ర‌మంలోనే గ్లామ‌ర్ ప్ర‌పంచంలో ఏ అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌డం లేదు.

నేటిత‌రం యాంక‌ర్ కం న‌టిగా నాలుగు చేతులా ఆర్జిస్తున్న అన‌సూయ ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను సినిమాల‌తో బిజీగా ఉన్నారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోనూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. తాజాగా అన‌సూయ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. జ‌బ‌ర్ధ‌స్త్ కోసం ఈ డ్రెస్ .. లావెండ‌ర్ ల‌వ్ బ‌గ్ అంటూ ఈ ఫోటోల‌కు వ్యాఖ్య‌ను జోడించారు. ఈ క‌ల‌ర్ గ్రేట్ క‌ల‌ర్ అంటూ మురిసిపోయారు. లావెండ‌ర్ క‌ల‌ర్ డ్రెస్ లో అన‌సూయ టూ హాట్ అంటూ యువ‌త‌రం వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు.

ఈ రోజు (మే 12) నుండి తెలంగాణ ప్రభుత్వం 10 రోజులు లాక్ డౌన్ ప్రకటించ‌గా.. అనసుయా భరద్వాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సురక్షితంగా ఉండాల‌ని కోరారు. దేశంలోని పరిస్థితులపైనా అన‌సూయ‌ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ వారి రోగనిరోధక శక్తిపై వ‌ర్క్ చేయాలని ప్రోత్సహించారు. ఈసారి వైరస్ ను చంపడంలో సమిష్టిగా కట్టుబడి ఉండాలని ప్రోత్సహించారు.

ఒక సంవత్సరం తరువాత మ‌నం తిరిగి సున్నాకి వచ్చాం. కానీ ఈసారి దాన్ని పూర్తిగా చంపడానికి కలిసిక‌ట్టుగా ఉండాలి. దయచేసి మీ రోగనిరోధక శక్తిపై పని చేయండి .. సరిగ్గా తినండి .. సరిగ్గా పని చేయండి .. సురక్షితంగా ఉంచండి! ధన్యవాదాలు! అని వ్యాఖ్యానం జోడించారు.