Begin typing your search above and press return to search.

రంగమ్మత్తని హీరో తల్లి పాత్ర కోసం సంప్రదిస్తున్నారా...?

By:  Tupaki Desk   |   17 July 2020 5:30 PM GMT
రంగమ్మత్తని హీరో తల్లి పాత్ర కోసం సంప్రదిస్తున్నారా...?
X
తెలుగు ప్రేక్షకులుకు స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై షోలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై తన హవా చూపిస్తోంది. యాంకర్‌ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సినిమాల్లో సైతం వరుస అవకాశాలు కొట్టేస్తోంది. సుకుమార్‌ - రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’లో 'రంగమ్మత్త'గా అందరిని మెప్పించింది. ఆ సినిమాతో అనసూయ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 'క్షణం' 'కథనం' 'ఎఫ్ 2' 'సోగ్గాడే చిన్నినాయనా' 'మీకుమాత్రమే చెప్తా' చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ వేడి పుట్టించే ఫోటో షూట్స్ హీట్ పెంచేస్తోంది. స్టార్ హీరోయిన్స్ కి ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అనసూయ యువ హీరో సుమంత్ అశ్విన్ నటిస్తున్న కొత్త సినిమాలో అతనికి తల్లి క్యారక్టర్ పోషించనుందని వార్తలు వచ్చాయి.

అయితే హీరో తల్లి పాత్ర కోసం యాంకర్ అనసూయని సంప్రదించారనే వార్తల్లో నిజం లేదని.. అవన్నీ రూమర్స్ అని తెలుస్తోంది. నిజానికి అనసూయకి కథలో కీలకంగా ఉండే ఆఫర్స్ వస్తున్నాయట. ఈ నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్న అనసూయ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కస్తున్న 'రంగమార్తాండ' సినిమాలో ప్రాధాన్యమున్న పాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా ఇటీవల షూటింగ్స్ అనుమతి లభించడంతో అనసూయ హోస్ట్ చేసే పలు షోలు కూడా స్టార్ట్ అయ్యాయి. మొత్తం మీద అటు సిల్వర్ స్క్రీన్ పై ఇటు స్మాల్ స్క్రీన్ పై మెరుస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది ఈ అందాల యాంకరమ్మ అనసూయ. రాబోయే రోజుల్లో ఎలాంటి క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుందో చూడాలి.