Begin typing your search above and press return to search.

సోగ్గాడికి చిలిపి మరదలుగా అనసూయ?

By:  Tupaki Desk   |   21 Jan 2015 4:54 AM GMT
సోగ్గాడికి చిలిపి మరదలుగా అనసూయ?
X
టాలీవుడ్‌ పాపులర్‌ యాంకర్‌ అనసూయ సోలో కథానాయికగా ఓ సినిమా తెరకెక్కుతోందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంతో పాటు మరికొన్ని సినిమాలకు సంతకాలు చేస్తూ జోరు పెంచేసింది అనసూయ. ఇప్పటికే రవికాంత్‌ పారేపు దర్శకత్వంలోని క్షణం అనే చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తోంది. ఇంతలోనే స్టార్‌ హీరోగా నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించే అవకాశం వచ్చింది.

డెబ్యూ దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కథ ప్రకారం ఈ చిత్రంలో నాగార్జునకు ఓ చిలిపి మరదలు ఉంటుంది. అల్లరి చిల్లర పనులు చేస్తుంటుంది. ఆ పాత్రకు ఎవరైతే సరిపోతారు అని దర్శకుడు ఆలోచిస్తే వెంటనే అనసూయ కళ్లలో కనిపించింది. అంతే వెంటనే తనని కలిసి విషయం వివరించాడు. అసలే అనసూయ నాగార్జునకి వీరాభిమాని. అందివచ్చిన అవకాశాన్ని వెంటనే ఒడిసిపట్టుకుంది. ఇదే చిత్రంలో లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ కథానాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనసూయ ఓ పాటలో నాగ్‌తో పాటు స్టెప్పు కలుపుతుందని సమాచారం.