Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ గారిని ఇంకా చాలా అడగాలి: అనసూయ

By:  Tupaki Desk   |   13 Dec 2021 9:46 AM IST
అల్లు అర్జున్ గారిని ఇంకా చాలా అడగాలి: అనసూయ
X
బుల్లితెరను వదిలిపెట్టకుండా అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చిన అనసూయ, ఈ మధ్య సినిమాల్లో తన దూకుడు పెంచింది. 'రంగస్థలం' సినిమాలో ఆమెను 'రంగమ్మత్త'గా చూపించిన సుకుమార్, ఈ సినిమాలో ఆమెను దాక్షాయణి పాత్రలో చూపించనున్నాడు. ఇది నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర. ఈ పాత్రలో అనసూయ పూర్తిగా డిఫరెంట్ లుక్ తో కనిపించనుంది. నిన్న రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనసూయ మాట్లాడుతూ .. " నిజంగా నాకు ఇదంతా ఒక కలలా ఉంది. రెండేళ్లుగా ఇంతమంది అభిమానులను మిస్ అవుతున్నాను.

ముందుగా నేను అల్లు అర్జున్ గారికి థ్యాంక్స్ చెప్పాలి .. సాధారణంగా అమ్మా నాన్నలను .. దేవుడిని కోరికలు అడుగుతారు. నేను ఇలాగే ఒక రోజు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు 'మీతో చేయాలనుంది' అని అడిగాను. టక్ మని వారం రోజుల్లో నాకు కాల్ వచ్చేసింది. ఇదే కంటిన్యూ అవుతుందంటే నేను చాలా అడగాలి .. సినిమాల్లో ఛాన్సులు. డబుల్ మీనింగ్ వచ్చేలా ఆమె అలా గ్యాప్ ఇచ్చి మాట్లాడటం వలన అభిమానుల్లో మళ్లీ ఈలలు .. గోలలు. నాకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్ గారికీ .. సుక్కూ సార్ కి కూడా నేను థ్యాంక్స్ చెబుతున్నాను.

రష్మికను మొదటి సినిమా నుంచి చూస్తున్నాను. ఇప్పుడు కూడా సామీ సామీ పాటను చూశాను. నాకే ఎలాగో ఉందంటే, వీళ్లంతా ఏమైపోతారో ఏమో మరి. మైత్రీ మూవీ మేకర్స్ నాకు హోమ్ బ్యానర్ వంటింది. నిర్మాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుకుమార్ గారు - మైత్రీ మూవీ మేకర్స్ వారి కాంబినేషన్లో వచ్చిన 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దేవీ సార్ .. సుకుమార్ సార్ ఇక్కడ లేకపోవడం వెలితి గానే ఉంది. నేను చేసింది నెగెటివ్ రోల్ అయినప్పటికీ, కూబా సార్ నన్ను ఎంతో అందంగా చూపించారు.

రానున్న రోజుల్లో నన్ను .. సునీల్ గారిని చాలా సార్లు చూడబోతున్నారు మీరు. 'మంగళం శ్రీను'గా ఇందాకా సునీల్ గారు అంతా చెప్పారు. కానీ నా విషయానికి వచ్చేసరికి నేను అలా చెప్పక్కర లేదు. మీ అందరినీ సర్ ప్రైజ్ చేయాలని నేను కంకణం కట్టుకున్నాను. నా గ్లామరంతా టీవీల్లో చూస్తున్నారు గనుక .. ఇక్కడ తగ్గేదే లే. ఈ ఈవెంట్ కి వచ్చిన రాజమౌళి గారికి .. కొరటాల శివగారికి .. అల్లు అరవింద్ గారికి .. బుచ్చిబాబు గారికి .. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను. అందరికీ మరో మాట చెప్పాలి .. ఇది 'పుష్ప ది రైజ్' .. ఇంకా ముందుంది .. తగ్గేదే లే" అని చెప్పుకొచ్చింది.