Begin typing your search above and press return to search.

మెగా హీరోకు షాకిచ్చే పాత్ర‌లో అన‌సూయ?

By:  Tupaki Desk   |   15 March 2022 2:30 AM GMT
మెగా హీరోకు షాకిచ్చే పాత్ర‌లో అన‌సూయ?
X
`సై రా న‌ర‌సింహారెడ్డి`తో దాదాపు ప‌దేళ్ల అనంత‌రం రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ద‌ఫా ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో ఆయ‌న సినిమాలు చేస్తూ షాకిస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ కు రెడీ కాకుండానే వ‌రుస‌గా నాలుగు చిత్రాల‌ని లైన్ లో పెట్టారు.

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో `ఆచార్య‌` చిత్రంలో న‌టిస్తున్నారు చిరు. ఈ మూవీ దాదాపుగా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 29న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోంది.

రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. చ‌ర‌ణ్ కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించారు. దేవాదాయ భూముల కుంభ‌కోణం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ అత్య‌తం భారీ స్థాయిలో తెర‌కెక్కించారు.

ఈ మూవీ పూర్తి కావ‌డంతో మెగాస్టార్ మిగ‌తా చిత్రాపై దృష్టిపెట్టారు. డైరెక్ట‌ర్ బాబితో `వాల్తేరు వీర‌య్య‌`, మోహ‌న్ రాజాతో `గాడ్ ఫాద‌ర్‌`.. మెహ‌ర్ ర‌మేష్ తో `భోళా శంక‌ర్‌` చిత్రాలు చేస్తున్నారు. వెంకీ కుడుముల‌తో డీవీవీ దాన‌య్య నిర్మించ‌నున్న మూవీ ప్రారంభం కావాల్సి వుంది.

ఇదిలా వుంటే మెగాస్టార్ న‌టిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `గాడ్ ఫాద‌ర్‌` కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన ఓ న్యూస్ ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ `లూసీఫ‌ర్‌`.

మోహ‌న్ లాల్‌, పుథ్వీరాజు సుకుమార‌న్, మంజు వారియ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇదే చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో అనువాదం చేసి విడుద‌ల చేశారు. అయితే అదే చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో రీమేక్ చేస్తున్నారు.

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో హీరో స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ మొద‌లైన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కీల‌క అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ఈ సోమ‌వారం ఈ చిత్రానికి సంబంధించిర కీల‌క షెడ్యూల్ ముంబైలో మొద‌లైంది. అక్క‌డ ఎన్ డీ స్టూడియోలో ప్ర‌త్యేకంగా వేసిన సెట్ లో ప్ర‌స్తుతం చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్ పాల్గొన‌గా కీల‌క ఘ‌ట్టాల‌ని ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా చిత్రీక‌రిస్తున్నార‌ట‌.

ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త ప్ర‌స్తుతం బ‌య‌టికి వ‌చ్చింద‌ని తెలిసింది. ఈ చిత్రంలో అన‌సూయ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ని, అయితే ఆమె పాత్ర మెగాస్టార్ కు షాకిచ్చే విధంగా వుంటుంద‌ని చెబుతున్నారు.

ఓ వ్య‌క్తి కార‌ణంగా గ‌ర్భవ‌తిగా మారి ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చే యువ‌తిగా అన‌సూయ క‌నిపిస్తుంద‌ని, అయితే సినిమాలోని కీల‌క స‌న్నివేశంలో అన‌సూయ హీరో చిరుకు షాకిస్తుంద‌ని చెబుతున్నారు. ఇంత‌కీ ఆమె పాత్ర ఏంటీ? . ఆమె పాత్ర వెన‌కున్న ట్విస్ట్ ఏంటీ అన్న‌ది ఆస‌క్తిక‌రం అంటున్నారు.