Begin typing your search above and press return to search.

రంగస్థల నటిగా రంగమ్మత్త

By:  Tupaki Desk   |   5 Dec 2019 6:43 AM GMT
రంగస్థల నటిగా రంగమ్మత్త
X
మెగా మూవీ 'రంగస్థలం' చిత్రంలో రంగమ్మత్త పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ నటిగా వరుసగా చిత్రాలు చేస్తూ వస్తుంది. యాంకర్‌ గా మరియు నటిగా దూసుకు పోతున్న అనసూయకు మరో మంచి సినిమాలో అవకాశం దక్కింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ' చిత్రంలో అనసూయకు ముఖ్యమైన పాత్ర దక్కిందట.

'నట సామ్రాట్‌' అనే మరాఠి సినిమా ఆధారంగా రంగమార్తాండ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో రమ్యకృష్ణ.. ప్రకాష్‌ రాజ్‌.. బ్రహ్మానందం.. రాహుల్‌ సిప్లిగంజ్‌ లు నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో అనసూయ కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రంగమార్తాండ సినిమాలో అనసూయ రంగస్థల నటిగా కనిపించబోతుందట. సినిమాలు ఇంత పాపులర్‌ కాకముందు నాటకాలు బాగా ఫేమస్‌. అప్పటి నాటకాల్లో నటించిన వారే కాల క్రమేనా నటీనటులుగా మారారు.

రంగమార్తాండ సినిమాలో నాటకాల్లో నటించే నటి పాత్రను అనసూయ చేయబోతుందట. ఆ పాత్ర సినిమాకు చాలా బలమైనదని అందుకే ఆమెను ఎంపిక చేసినట్లుగా టాక్‌ వినిపిస్తుంది. అప్పట్లో నాటకాల్లో నటించే నటీ నటులు పడ్డ ఇబ్బందులు మరియు ఇతరత్ర విషయాలను అనసూయ పాత్ర ద్వారా కృష్ణవంశీ చూపించబోతున్నాడు. ఒక జబర్దస్త్‌ ఐటెం సాంగ్‌ తరహాలో అనసూయపై ఒక పాట కూడా ఉంటుందని సమాచారం. విభిన్నమైన నేపథ్యంలో రూపొందబోతున్న ఈ చిత్రంతో కృష్ణవంశీ మళ్లీ ఫామ్‌ లోకి రావడం ఖాయం అంటూ ఆయన అభిమానులు ధీమాగా ఉన్నారు.