Begin typing your search above and press return to search.

షార్ట్ ఫ్రాకుతో స్టార్ యాంక‌ర్ కం న‌టి హ‌ల్చ‌ల్

By:  Tupaki Desk   |   2 May 2021 10:30 AM GMT
షార్ట్ ఫ్రాకుతో స్టార్ యాంక‌ర్ కం న‌టి హ‌ల్చ‌ల్
X
జ‌బ‌ర్ధ‌స్త్ యంక‌ర్ అన‌సూయ కాస్త రంగస్థ‌లం రంగ‌మ్మ‌త్త‌గా ప్ర‌మోట‌య్యాక స‌న్నివేశ‌మేంటో తెలిసిందే. తెలుగు-త‌మిళం స‌హా ప‌లుభాష‌ల నుంచి వ‌రుస అవ‌కాశాల‌తో అన‌సూయ ఉక్కిరిబిక్కిరి అయ్యే ప‌రిస్థితి. కేవ‌లం తెలుగులోనే అర‌డ‌జ‌ను నుంచి డ‌జ‌ను సినిమాల వ‌ర‌కూ చేస్తోంది.

ఒక రోజు షూటింగుకే ల‌క్ష‌ల్లో పారితోషికం ఆర్జిస్తున్న టాప్ యాంక‌ర్ కం న‌టిగా ఇండ‌స్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు. ఒక‌ప్పుడు బ్ర‌హ్మానందం రోజుకు 5ల‌క్ష‌లు.. అలీ రూ.3 ల‌క్ష‌లు అని చెప్పుకున్న‌ట్టే ఇప్పుడు అన‌సూయ విష‌యంలోనూ రోజువారీ ఆర్జ‌న గురించి గుస‌గుస‌లాడేవాళ్లు క‌నిపిస్తున్నారు.

అదంతా అటుంచితే త‌న క్రేజును అంత‌కంత‌కు పెంచుకునే దిశ‌గా అన‌సూయ ప్లాన్ కూడా ఔరా! అనిపిస్తోంది. సోష‌ల్ మీడియాల్లో ఇప్ప‌టికే అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ని క‌లిగి ఉన్న అన‌సూయ నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో త‌న రేంజును మరింత పెంచుకుంటున్నారు. ఇటీవ‌ల క్రైసిస్ లాక్ డౌన్ తో ఈ తీరిక స‌మ‌యాన్ని మ‌రింత స‌ద్వినియోగం చేసుకుంటూ ఫోటోషూట్ల‌తో హీటెక్కించేస్తున్న అన‌సూయ‌.. ఇదిగో ఇలా షార్ట్ ఫ్రాకుతో క‌నిపించి ప‌రేషాన్ చేస్తోంది! మిల మిల మెరుపుల‌పై బ్లాక్ టాప్ అదిరింది అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతున్నాయ్.