Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రంగ‌మ్మ‌త్త‌ను చూసి నేర్వండి అమ్మ‌డూ..!

By:  Tupaki Desk   |   19 March 2021 8:33 AM GMT
ఫోటో స్టోరి: రంగ‌మ్మ‌త్త‌ను చూసి నేర్వండి అమ్మ‌డూ..!
X
మ‌డిగ‌ట్టుకు కూచుంటే అవ‌కాశాలిచ్చేదెవ‌రు? కాస్త‌యిన ప‌ట్టు విడుపు ఉంటేనే రంగుల మాయా ప్ర‌పంచంలో అవ‌కాశాలు. ఈ విష‌యాన్ని చాలా ముందే గ్ర‌హించిన యాంక‌ర్ కం న‌టి అన‌సూయ ఎంతో తెలివైన ప్లానింగ్ తో కెరీర్ ని మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా తీర్చిదిద్దుకోవ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యార‌ని చెప్పాలి.

ఓవైపు బుల్లితెర యాంక‌ర్ గా రాణిస్తూనే.. జ‌బ‌ర్ధ‌స్త్ విజ‌యంలో కీల‌క భాగ‌స్వామిగా స‌త్తా చాటి అన‌సూయ త‌న స్థాయిని పెంచుకున్నారు. అదే స‌మ‌యంలో దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకున్న చందంగా తెలివిగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప్ర‌ధాన నాయిక‌గానూ వెండితెర అవ‌కాశాల్ని ఛేజిక్కించుకున్నారు. రంగ‌స్థ‌లం చిత్రంతో మ‌రో లెవ‌ల్ ని అందుకున్నారు. ఆ మూవీలో రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ న‌ట‌న‌కు యూత్ స్పెల్ బౌండ్ అయిపోయింది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌తో అన‌సూయ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారంటే సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. నేటిత‌రంలో రోజుకు 2-3ల‌క్ష‌ల ఆదాయం ఆర్జిస్తున్న న‌టిగా అనసూయ పాపుల‌ర‌య్యారంటే ఆ స్థాయిని అందుకునేందుకు ఎంత‌గా హార్డ్ వ‌ర్క్ చేశారో.. ఎంత‌గా కాలంతో పాటు ప‌రుగులు పెట్టారో అర్థం చేసుకోవ‌చ్చు. త‌న‌కు కుటుంబం నుంచి ప్రేమించే భ‌ర్త నుంచి ఉన్న స‌పోర్టుతోనే ఇదంతా సాధ్య‌మైంద‌ని చెప్పాలి.

ప్రస్తుతం అన‌సూయ వ‌రుస ఫోటోషూట్లు డిజిట‌ల్ మాధ్య‌మంలో హాట్ టాపిక్ గా మారాయి. చీర‌క‌ట్టి రంగ‌మ్మ‌త్త‌లా రెచ్చిపోయినా.. మోడ్ర‌న్ ఔట్ ఫిట్ లో ప్యారిస్ హంస‌నే త‌ల‌పించినా అన‌సూయ స్టైలే వేరు అన్నంత‌గా పాపుల‌రైపోయారు. ఇప్ప‌టికిప్పుడు తెలుగు త‌మిళంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ బిజీగా ఉన్న అనసూయ తాజాగా ర‌వితేజ ఖిలాడీ చిత్రీక‌ర‌ణ కోసం ఇట‌లీ -మిలాన్ వెళ్లారు. రవితేజ- రవివర్మ కాంబినేష‌న్ లో రూపొందుతున్న‌ ఈ చిత్రంలో అనసూయ అదిరిపోయే పాత్రలో కనిపించ‌నున్నార‌ని త‌న పాత్ర ఇందులో ఎంతో కీల‌కం అని తెలిసింది.