Begin typing your search above and press return to search.

అనసూయతో మంచు వారి 'ఫిదా'

By:  Tupaki Desk   |   20 Sept 2017 8:00 PM IST
అనసూయతో మంచు వారి ఫిదా
X
ప్రస్తుత రోజుల్లో ఒక సినిమాను తెరకెక్కించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతే కాకుండా ఎక్కువ టైమ్ కూడా పడుతుంది. దానికి తోడు సినిమా అసలు సరిగ్గా వస్తుందా లేదా అనే అనుమానాలతో పాటు గ్యారంటీ లేని రిజల్ట్ చాలా భయపెడతాయి. కానీ బుల్లి తెరపై చేసే రియాలిటీ షోల్లో అలా ఏం ఉండదు. రిజల్ట్ కూడా టెలికాస్ట్ అయిన రోజులోనే తెలిసిపోతుంది. ఒకవేళ నష్టం వచ్చినా అంత ఎక్కువ నష్టం ఏమి ఉండదు.

దీంతో సీనియర్ నిర్మాతలు- నటీనటులు ఎక్కువగా బుల్లితెరపై షోలను ప్రొడ్యూస్ చేస్తూ మంచి వసూళ్లను రాబడుతున్నారు. ఇప్పుడు అదే తరహాలో మంచు లక్షి బుల్లితెరపై ఒక షోని నిర్మించబోతోంది. కాని చిత్రమేమిటంటే.. ఆ షో లక్ష్మి హోస్ట్ చేయడం లేదట. యాంకర్ అనసూయ కి బాధ్యతలు అప్పగించిందట మంచు వారి అమ్మాయి. ఇప్పటికే పలు షోలను నిర్వహించి మంచి యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ ఇప్పుడు మంచు వారి సమర్పణలో "ఫిదా" అనే షోని చేయబోతోంది.

ఈ షోని ప్రముఖ జెమినీ టీవీ ఛానల్ వారు టెలికాస్ట్ చేయబోతున్నారట. లక్ష్మి ఈ షో మీద చాలా నమ్మకంతో ఉందట. ఇంతకుముందు లక్ష్మి సినిమాలను నిర్మించి చాలా నష్టపోయింది. మరి అనసూయ హోస్ట్ గా నిర్వహించబోయే "ఫిదా" షోతో అయినా లక్ష్మి లాభపడుతుందో లేదో చూడాలి.