Begin typing your search above and press return to search.

మత్తెక్కిస్తున్న అనసూయ.. మళ్లెప్పుడొస్తుందో

By:  Tupaki Desk   |   1 March 2018 5:51 PM IST
మత్తెక్కిస్తున్న అనసూయ.. మళ్లెప్పుడొస్తుందో
X
అందం ఆంటే సిల్వర్ స్క్రీన్ కే సొంతం అని అందరూ అనుకునేవారు. కానీ బుల్లితెర కి కుడా తన స్టైల్ తో హంగులతో అందాన్ని ఇంట్రడ్యూస్ చేసిన యాంకరే అనసూయా. స్టార్ హీరోయిన్లకు సైతం గట్టి పోటీని ఇవ్వగలదు ఈమె సోయగాం. హీరోయిన్ల లాగానే ఈమె కూడా ఫోటోషూట్ లతో పిచ్చెక్కిస్తోంది.

ఈమధ్యనే ఒక హాట్ ఫోటోషూట్ లో పాల్గొన్న అనసూయ చీర ని కొత్త స్టైల్ లో కట్టుకుని అందాన్ని ఆరబోస్తూ కుర్రకారు చూపుని తన వైపు తిప్పుకుంటోంది. ఈమెను చూసిన అందరూ 'సూయ సూయ.. అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా' అంటూ పాటలు పాడేస్తున్నారు. ఒక పోల్ ని పట్టుకుని అద్దాలను సరిచేసుకుంటున్నట్టు పోస్ ఇస్తున్న ఈ సుందరి ని చూస్తే ఎవరైనా 'జబర్దస్త్' అనకుండా మానరు. ఈమె అందం టాలెంట్ టీవీ కి మాత్రమే అంకితమైపోవట్లేదండోయ్. ఈమె టీవీ షో లతో పాటు మరో చేత్తో సినిమాలలో కూడా కనిపిస్తూ మన మనసులు కొల్లగొట్టేస్తుంది. క్షణం లో పోలీస్ ఆఫీసర్ లా దర్శనమిచ్చిన ఈమె ఇప్పుడు రంగస్థలం సినిమా లో కూడా మనల్ని ఎంటర్టైన్ చేయబోతోంది.

ఇకపోతే ట్వీట్టర్ ను వదిలేసి వెళిపోయిన అనసూయ.. ప్రస్తుతానికి ఇంకా తిరిగిరాలేదు. ఆ మధ్యన సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఒక చిన్నపిల్లాడి మొబైల్ ఫోన్ ను ఆమె బద్దలు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అందరూ ఆమెను తిట్టడంతో.. సోషల్ మీడియాను వదిలేసింది. తిరిగి ఎప్పుడొస్తుందో చూడాలి మరి.