Begin typing your search above and press return to search.

ఆ కుర్రాడి డ్యాన్స్ కు అనసూయ ఫిదా

By:  Tupaki Desk   |   15 Jan 2020 10:20 AM IST
ఆ కుర్రాడి డ్యాన్స్ కు అనసూయ ఫిదా
X
అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరు పిల్లలున్న ఆమె గ్లామర్ ప్రదర్శించటంలో వెనుకాడకపోవటం ఒక ఎత్తు అయితే.. ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకునేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆమెకు తగ్గట్లే.. ఆమెను అభిమానించే వారు కోట్లల్లో ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటారు. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. దానికి అనసూయ సైతం ఫిదా అయ్యారు.

ఎంతలా అంటే.. ఎవరా కుర్రాడు? అని అడగకుండా ఉండలేనంతగా. ఆ మాటకు వస్తే అనసూయ మాత్రమే కాదు.. బాలీవుడ్ అగ్రహీరో హృతిక్ రోషన్ సైతం ఆ కుర్రాడి గురించి ఎంక్వయిరీ చేశారు. పలువురు సెలబ్రిటీలను ఫిదా చేస్తున్న ఆ కుర్రాడి వివరాలు బయటకు రాకున్నా.. తన టిక్ టాక్ వీడియోతో అతగాడో సంచలనంగా మారారు.

ఇంతకీ హృతిక్ రోషన్ .. అనసూయ మనసుల్ని దోచేసిన ఆ టిక్ టాక్ వీడియో కాస్త ప్రత్యేకమని చెప్పాలి. టిక్ టాక్ ఫ్లాట్ ఫాం మీద పోస్టు చేసే వీడియోలు దాదాపుగా 10 నుంచి 20 సెకన్లకే పరిమితమవుతాయి. చాలా కొద్ది మాత్రమే నిమిషం నిడివి ఉంటాయి. అందుకు భిన్నంగా ఇప్పుడు వైరల్ గా మారిన వీడియో మాత్రం ఏకంగా 2.20 నిమిషాల నిడివి ఉంది.

అయితే మాత్రం.. చూపులు తిప్పుకోలేనంతగా డ్యాన్స్ మూవ్ మెంట్లతో చెలరేగిపోయిన ఆ కుర్రాడి ఫెర్ ఫార్మెన్స్ కు ఫిదా అయిన అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. సదరు డ్యాన్స్ చేసిన కుర్రాడు ఎవరన్న ప్రశ్నతో పాటు.. అతడి స్టైల్ ను.. డ్యాన్స్ మూమెంట్స్ ను ఆకాశానికి ఎత్తేసింది. పలు పాటలకు తగ్గట్లుగా తనదైన నృత్యాలతో కలిపి వీడియో చేసిన ఆ కుర్రాడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.

వీడియో కోసం క్లిక్ చేయండి