Begin typing your search above and press return to search.

రంగమ్మ ఆడిషన్స్ అలా జరిగాయట

By:  Tupaki Desk   |   26 April 2018 3:31 PM IST
రంగమ్మ ఆడిషన్స్ అలా జరిగాయట
X
ఇవాల్టి రోజుల్లో సినిమా స్టార్లు.. అసలు ఆయా సినిమాలకు అంగీకరించడమే గొప్ప అన్న చందంగా బిహేవ్ చేస్తున్నారు. అయినా సరే.. ఆయా పాత్రలకు ఆయా నటులు సరిపోతారా లేదా అన్న విషయాన్ని ముందుగానే చెక్ చేసుకుని మరీ మూవీస్ తీసేవాళ్లు కొందరు ఇంకా ఉన్నారు.

ఇలా ఆడిషన్స్ కు అటెండ్ అయేందుకు అందరూ ఓకే అనరు కానీ.. అనసూయ మాత్రం అలా కాదు లెండి. రీసెంట్ గా రంగస్థలం మూవీలో రంగమ్మత్త పాత్రలో అనసూయ ఎంతగా ఒదిగిపోయిందో చూశాం. అనసూయ ఆ పాత్రకు మాత్రమే కాదు.. సినిమాకు కూడా బాగా స్ట్రెంగ్త్ అయింది. తన నటనతో ఆ స్థాయిలో మెప్పించింది అనసూయ. అయితే.. ఈ పాత్ర అంత తేలికగా ఈమెకు దక్కలేదు. అందుకోసం ముందుగా ఆడిషన్స్ చేయగా.. వాటికి అటెండ్ అయింది ఈ హాట్ యాంకర్. రంగమ్మత్త పాత్రకు తగినట్లుగా మేకప్ వేసుకుని.. రామ్ చరణ్ తో చేయాల్సిన సీన్ కు సంబంధించిన డైలాగ్స్ ను తన స్టైల్ లో చెప్పి మెప్పించింది. ఆ తర్వాత ఈ రంగమ్మత్త పాత్ర అనసూయకు దక్కింది.

ప్రస్తుతం ఈ ఆడిషన్స్ కు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ ట్రెండింగ్ అవుతోంది. పల్లెటూరి యంగ్ ఆంటీ తరహా పాత్ర అయిన రంగమ్మత్త రోల్ కు ప్రాణం పోసేందుకు ముందు.. అనసూయ ఎలా ఆ పాత్రలో ఒదిగేందుకు కష్టపడిందో ఈ వీడియోలో కనిపిస్తుంది.

వీడియో కోసం క్లిక్ చేయండి