Begin typing your search above and press return to search.

జబర్దస్త్ భామలకు చెరో సినిమా..

By:  Tupaki Desk   |   4 Feb 2016 12:44 PM IST
జబర్దస్త్ భామలకు చెరో సినిమా..
X
వుండడంలో కాస్త బూతు కలిగి వున్నా బుల్లితెరపై ప్రేక్షకులను నవ్విస్తున్న కామెడీ షోగా జబర్దస్త్ యమ పాపులర్ అయ్యింది. అక్కడ ఆర్టిస్ట్ లకు మంచి సినిమా అవకాశాలు రావడం కూడా ఈ షో దోహదపడింది. అయితే జబర్దస్త్ అనగానే గుర్తొచ్చే హాట్ యాంకరమ్మలు అనసూయ మరియు రెష్మి ఇప్పుడు బుల్లితెరనే కాకుండా ఒకేసారి వెండితెరపై మెరవనున్నారు.

అనసూయ, రెష్మి గౌతం లు విడివిడిగా నటిస్తున్న సినిమాలు నిన్న వార్తలలో నిలిచాయి. పోలీస్ ఆఫీసర్ గా అనసూయ నటిస్తున్న క్షణం సినిమా ఫస్ట్ లుక్ నిన్న విడుదల చేసారు. అడవి శేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. చిన్న పిల్లవాడి మిస్సింగ్ కేస్ నేపధ్యంలో ఈ సినిమా సాగే అవకాశం వున్నట్టు పోస్టర్ లు చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లలో వైవిధ్యం ప్రేక్షకుల దృష్టిని అందుకుంది.

ఇక రెష్మి పల్లెటూరి అమ్మాయి పాత్రలో పరికిణి కట్టుకుని గుంటూరు టాకీస్ ట్రైలర్ లో కనువిందు చేసింది. కనిపించిన రెండు మూడు షాట్ లలో అందాల ఆరబోయడమే కాక లిప్ లాక్ కూడా సినిమాలో వున్నట్టు స్పష్టం చేయడంతో ఈ భామ హాట్ టాపిక్ అయ్యింది. మొత్తానికి జబర్దస్త్ భామలు వెండితెరపైనా అదే మాట అనిపిస్తారేమో చూడాలి..