Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చినుగులా చించుకుందా ఏంటిలా?

By:  Tupaki Desk   |   30 Nov 2020 6:00 AM IST
ఫోటో స్టోరి: చినుగులా చించుకుందా ఏంటిలా?
X
న‌టించింది ఒక్క సినిమానే అయినా డ‌జను సినిమాలు చేసిన భామ‌లా టాప్ సీనియ‌ర్ లా వ్య‌వ‌హ‌రించేస్తోంది అన‌న్య పాండే. ఈ అమ్మడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇప్ప‌ట్లో ఎదురే లేద‌ని అర్థ‌మ‌వుతోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 లో న‌టించిన అనన్య ఇప్ప‌టికిప్పుడు వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది.

పైగా టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న పాన్ ఇండియా ఆఫ‌ర్ అందుకుని స‌ర్ ప్రైజ్ చేసింది. ఫైట‌ర్ మూవీతో అన‌న్య ఇటు సౌత్ అంత‌టా ప‌రిచ‌యం కాబోతోంది. ఇక ఆ కాన్ఫిడెన్స్ ఎక్క‌డా దాచుకోవ‌డం లేదు.

ఇదిగో ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు లేటెస్టు ఫోటోషూట్ల‌తో చెల‌రేగుతూ అన‌న్య ఇస్తున్న ట్రీట్ మామూలుగా లేదు. తాజాగా చినుగుల వైట్ డెనిమ్ జీన్స్ .. టైట్ బ్రింజాల్ క‌ల‌ర్ టాప్ తో అద‌ర‌గొట్టేసింది. డైనింగ్ టేబుల్ ముందు అన‌న్య అలా కూల‌బ‌డితే త‌న‌తో పాటే రెండు పెట్ డాగ్స్ కూడా అంతే ఇదిగో రిలాక్స‌వుతున్నాయి. సింపుల్ గా న‌వ్వేస్తూ అన‌న్య కుర్ర‌కారు మైండ్ లో రిజిస్ట‌ర్ అయిపోతోందిలా.