Begin typing your search above and press return to search.
కేజీ కండైనా లేదు ఫైటింగులు చేస్తుందట!
By: Tupaki Desk | 27 Nov 2020 10:30 AM ISTఇప్పుడు అదే బాటలో నవతరం కథానాయిక అనన్య పాండే క్రేజీగా ఫైటింగులకు సిద్ధమవుతోందట. పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ ఫైటర్ చిత్రంతో ఈ ఫీట్ కి రెడీ అవుతోందని సమాచారం. ఈ మూవీతోనే ఈ సన్నజాజి సోయగం టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. పూరి -విజయ్ ఇద్దరూ యంగ్ బ్యూటీ నటనను పొగిడేయడమే గాక సెట్ లో అంకితభావానికి ఫిదా అయిపోయారు. పలుమార్లు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఏకంగా యాక్షన్ క్వీన్ గా అనన్యను మార్చేస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో.. సదరు భామ `ఫైటర్`ను ‘పూర్తిగా భిన్నమైన ప్రపంచం’ అని అభివర్ణించింది. తనకు పూరి అండ్ టీమ్ రకరకాల అసైన్ మెంట్స్ ఇస్తోందట. వీటి విషయంలో ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తన అభిమానులతో ప్రతిదీ పంచుకునేందుకు తాను వేచి ఉండలేనని ఆరాటపడిపోతోంది అనన్య. త్వరలోనే కిక్ లు అదిరేలా మాంచి ఫైటింగులు చేయాల్సి ఉంటుందని ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని ట్రై చేస్తున్నానని అనన్య వెల్లడించింది. అన్నట్టు కేజీ కండైనా లేకుండా రబ్బరు బొమ్మను తలపించే అనన్య భారీగా ఫైటింగులు చేయడం అంత సులువా? దానికి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటోందా? పూరి సార్ ఆన్సర్ చేయాలి మరి.