Begin typing your search above and press return to search.

కొత్త హీరోయిన్.. యాక్సిడెంట్ జస్ట్ మిస్

By:  Tupaki Desk   |   5 Jun 2018 6:25 AM GMT
కొత్త హీరోయిన్.. యాక్సిడెంట్ జస్ట్ మిస్
X
బాలీవుడ్ లో ప్రస్తుతం ఒక న్యూస్ వైరల్ గా మారింది. అప్ కమింగ్ బ్యూటీ అనన్య పాండే ఊహించని విధంగా ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా ఒక్క సినిమాతో కూడా ఎంట్రీ ఇవ్వని ఈ భామకు ప్రస్తుతం నార్త్ జనాలు తెగ ఎట్రాక్ట్ అవుతున్నారు. సీనియర్ యాక్టర్ చుంకి పాండే కూతురు అంటే మొదట ఎవరు నమ్మలేదు.

కానీ సోషల్ మీడియా వలన ఫొటో షూట్స్ బాగా వైరల్ అయ్యాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రస్తుతం అనన్య స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై బాలీవుడ్ లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇకపోతే రీసెంట్ గా అమ్మడు యాక్సిడెంట్ గురై అందరిని టెన్షన్ పెట్టింది. ఒక సిన్ లో కారు డ్రైవ్ చేస్తూ డైరెక్ట్ గా చెట్టును ఢీకొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

కారు ముందు భాగంలో గట్టిగానే డ్యామేజ్ అవ్వడంతో అనన్య గాయపడి ఉంటుందని అనుమానం వచ్చింది కానీ ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదు. సేఫ్ గా ఉండడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. మొదటి సినిమాలోనే ఇలా జరిగిందేంటని ఇంట్లో వాళ్లు దిష్ఠి తీయడం మొదలు పెట్టారట. 2012 లో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న చిత్రమే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2.