Begin typing your search above and press return to search.

లైగ‌ర్ బ్యూటీ నుంచి ఇది ఊహించ‌నిది

By:  Tupaki Desk   |   10 May 2021 3:32 AM GMT
లైగ‌ర్ బ్యూటీ నుంచి ఇది ఊహించ‌నిది
X
మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా సెల‌బ్రిటీలంతా త‌మ త‌ల్లుల గురించి ఎంతో గొప్ప‌గా..గ‌ర్వంగా చెప్పుకున్నారు. త‌మ మాతృమూర్తితో ఉన్న అనుభూతుల్ని పంచుకుంటూ సంతోషంగా త‌ల్లుల‌తో గ‌డిపారు. మాతృమూర్తి గొప్ప‌త‌నాన్ని వ‌ర్ణిస్తూ త‌ల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోగ‌లం అంటూ ప‌లువురు సెల‌బ్రిటీలు ఎమోష‌న‌ల్ అయ్యారు. అయితే డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ `లైగ‌ర్` హీరోయిన్ మాత్రం మ‌దర్స్ డే రోజున విభిన్నంగా స్పందించింది. త‌న త‌ల్లి వ‌య‌సులో ఉన్న‌ప్పుడు బికినీ ధ‌రించిన ఓ ఫోటోను మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేసి షాక్ ఇచ్చింది.

`లైగ‌ర్` భామ అన‌న్య పాండే షేర్ చేసిన ఫోటోపై అభిమానుల నుంచి ఘాటైన వ్యాఖ్య‌లు వినిపించాయి. సోష‌ల్ మీడియాల్లో ఫాలోవ‌ర్స్ త‌న‌పై ట్రోల్స్ తో విరుచుకుప‌డ్డారు. నువ్వు అందంగా ఉండ‌టానికి మీ అమ్మగారే కార‌ణమ‌ని కొంద‌రు పాజిటివ్ గా స్పందించినా.. ఇది అప‌విత్ర‌మైన ప‌ని అంటూ మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు.

బాలీవుడ్ లో స్టార్ డాట‌ర్ గా ఎంట్రీ ఇచ్చిన అన‌న్య త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగేస్తోంది. చుంకీ పాండే- భావ‌న పాండే దంప‌తుల వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన అన‌న్య పాండే ప్ర‌స్తుతం వ‌రుస‌ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి లైగ‌ర్ చిత్రంతో త‌న‌ని ప‌రిచ‌యం చేస్తుండ‌టంతో ఈ భామ‌పై బోలెడ‌న్ని అంచనాలేర్ప‌డ్డాయి. సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో పాగా వేడ‌యం ఖాయ‌మ‌నే టాక్ జోరుగానే సాగుతుంది.