Begin typing your search above and press return to search.

రౌడీ బోయ్స్ కి క్రాక్ పుట్టిస్తున్న లైగ‌ర్ బ్యూటీ

By:  Tupaki Desk   |   8 April 2021 3:30 AM GMT
రౌడీ బోయ్స్ కి క్రాక్  పుట్టిస్తున్న లైగ‌ర్ బ్యూటీ
X
అవును.. లైగ‌ర్ బ్యూటీ క్రాక్ పుట్టిస్తోంది. రౌడీ బోయ్స్ కి గుండెల్లో ఒణుకు పుట్టిస్తోంది. త‌న‌దైన అందం చందం క‌వ్వింత‌తో మెంట‌లెక్కిస్తోంది. అందుకు ఇదిగో ఈ ఫోటోనే సాక్ష్యం.

సోష‌ల్ మీడియా డిజిట‌ల్ యుగంలో ప‌బ్లిసిటీతో ఎలా దూసుకుపోవాలో రౌడీ హీరోయిన్ అన‌న్య పాండేని చూసి నేర్వాల్సిందే. నేటిత‌రం నాయిక‌ల్లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న ఈ అమ్మ‌డు వ‌రుస‌గా భారీ క్రేజీ ఆఫ‌ర్ల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీ. ఇంత బిజీలోనూ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని విడిచిపెట్ట‌డం లేదు. ఇటీవ‌లే మ‌రో క్రేజీ ప్ర‌క‌ట‌న‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇందుకోసం ఏకంగా కోట్ల‌లో కాంట్రాక్టు కుదుర్చుకుంద‌ని స‌మాచారం.

విజయ్ దేవరకొండతో కలిసి మోజ్ బ్రాండ్ తో ఇంత‌కుముందు భారీ డీల్ కుదుర్చుకున్న అన‌న్య పాండే నిరంత‌రం హాటెస్ట్ పోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేస్తోంది. తాజాగా కిల్ల‌ర్ అందంతో మ‌రోసారి విరుచుకుప‌డింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోల్ని అభిమానులు వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. మోజ్ కి సంబంధించిన‌ అనన్య వాణిజ్య ప్రకటన హిందీ భాషలో ఉండగా.. విజయ్ ప్రకటన తెలుగు- తమిళం- కన్నడ -మలయాళంలో ఉంది. విజ‌య్- అన‌న్య జంట‌గా పూరి తెర‌కెక్కిస్తున్న లైగ‌ర్ పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిన‌దే.