Begin typing your search above and press return to search.

లైగ‌ర్ బ్యూటీ అన్ లిమిటెడ్ ట్రీట్ కి ఫిదా

By:  Tupaki Desk   |   10 Feb 2021 10:00 AM IST
లైగ‌ర్ బ్యూటీ అన్ లిమిటెడ్ ట్రీట్ కి ఫిదా
X
క‌ర‌ణ్ జోహార్ డిస్క‌వ‌రీ అన‌న్య పాండే టాలీవుడ్ లో లైగ‌ర్ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ చేయ‌నుండ‌గా అన‌న్య‌కు ఇటు ద‌క్షిణాదినా అంత‌కంత‌కు ఫాలోయింగ్ పెరుగుతోంది.

ఇంకా డెబ్యూ సినిమా రిలీజ్ కాక‌ముందే అన‌న్యకు ఫ్యానిజం పెరుగుతోందంటే దానికి కార‌ణం రౌడీ ఫ్యాన్స్. త‌మ ఫేవ‌రెట్ రౌడీ బోయ్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టిస్తున్న నాయిక‌గా అమ్మ‌డిని ఆరాధిస్తున్నారంతా.

న‌టుడు చుంకీ పాండే న‌ట‌వార‌సురాలిగా రంగ ప్ర‌వేశం చేసినా ఈ అమ్మ‌డు తెలివిగా ఒక్కో మెట్టు ఎక్కేస్తున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అటు ఉత్త‌రాది ఇటు ద‌క్షిణాది రెండో చోట్లా వేగంగా పాపుల‌రవుతోంది. ఆ మేర‌కు అవ‌కాశాల్ని విస్త‌రించుకునే ప్లాన్ లో ఉంది. ప్ర‌స్తుతం ఇన్ స్టా వేదిక‌గా త‌న ఫాలోయింగ్ ని అమాంతం పెంచుకోవాల‌ని త‌పిస్తోంది. ఇక ఇటీవ‌ల మాల్దీవుల విహారం నుంచి వేడెక్కించి బికినీ బీచ్ ట్రీట్ తో క‌ట్టిప‌డేసిన అన‌న్య వ‌రుస ఫోటోషూట్ల‌తో ఇన్ స్టాలో మంట‌లు పెడుతోంది. చిట్టి పొట్టి నిక్క‌ర్లు ఓవైపు.. బికినీలు మ‌రోవైపు .. చినుగుల జీన్స్ ఇంకోవైపు ఎటు చూసినా అన‌న్య స్టైల్ ఐక‌న్ గా హీట్ పెంచేస్తోంది. లైగ‌ర్ లో న‌టిస్తూ సాటి న‌ట‌వార‌సురాళ్లు కుళ్లుకునేంత‌గా స్పీడ్ చూపించ‌డం హాట్ టాపిక్ గా మారింది. అన్న‌ట్టు అన‌న్య‌పై అప్పుడే మ‌న స్టార్ హీరోల క‌న్ను పడింద‌ట‌. లైగ‌ర్ ఫ‌లితాన్ని బ‌ట్టి ఈ అమ్మ‌డికి టాలీవుడ్ లో మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కే వీలుంద‌న్న‌ది ఓ అంచ‌నా.