Begin typing your search above and press return to search.

ట్రెండింగ్‌: న‌ట‌వార‌సురాలి జీవితం త‌ల‌కిందులు

By:  Tupaki Desk   |   9 Oct 2020 3:00 PM IST
ట్రెండింగ్‌: న‌ట‌వార‌సురాలి జీవితం త‌ల‌కిందులు
X
ఫైట‌ర్ మూవీతో టాలీవుడ్ కి ప‌రిచ‌యం అవుతోంది న‌ట‌వార‌సురాలు అన‌న్య పాండే. రౌడీ బోయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న క్రేజీగా ఆఫ‌ర్ ప‌ట్టేసింది. పూరి-క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా ఈ మూవీని పాన్ ఇండియా రేంజులో తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేసిన సంగ‌తి విధిత‌మే. ఈ మూవీతో అన‌న్య పేరు సౌత్ లో మార్మోగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

అయితే వీట‌న్నిటినీ మించి ఈ క్యూట్ గాళ్ సోష‌ల్ మీడియా పోస్టింగుల‌తో అంత‌కంత‌కు హీట్ పెంచేయ‌డం రౌడీ ఫ్యాన్స్ లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అనన్య పాండే మిడ్ వీక్ స్పెష‌ల్ యోగా చూశారుగా.. ఇలా త‌ల‌కిందులుగా అస‌నంలో ఎంత కాన్ స‌న్ ట్రేట్ చేసిందో. జీవితం త‌ల‌కిందులైనా త‌న‌కు మాత్రం ఏమీ కాదులే అన్న‌ట్టుగానే ఉందీ ఫోజు. పింక్ స్పోర్ట్ లుక్ లో అన‌న్య హీట్ పెంచేసింది. స్పోర్ట్స్ బ్రా .. మినీ షార్ట్స్ ‌లో హెడ్ స్టాండ్ లుక్ తో షాకిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో జోరుగా యువ‌త‌రంలో వైర‌ల్ అయిపోతోంది.

అనన్య పాండే చివరిసారిగా ఖాలి పీలీలో ఇషాన్ ఖట్టర్ సరసన కనిపించింది. మహమ్మారి కారణంగా ఈ చిత్రం OTTలో విడుద‌లైంది. త‌దుప‌రి ఫైటర్ మూవీ కోసం విజయ్ దేవరకొండను రొమాన్స్ చేయనుంది. ఖలీ పీలీ విడుదలైన తర్వాత అనన్య తన యోగా సెషన్ స్నీక్ పీక్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోని తీరిగ్గా చూస్తే పింక్ యోగా చాపను ఎంచుకుంది ఈ బ్యూటీ. త‌దుప‌రి షకున్ బాత్రా మూవీలో న‌టించ‌నుంది. ఈ చిత్రం కోసం దీపికా పదుకొనే .. సిద్ధాంత్ చతుర్వేదిలతో క‌లిసి ప‌ని చేయ‌నుంది.