Begin typing your search above and press return to search.

అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఓకే అంటున్న స్టార్‌ కూతురు

By:  Tupaki Desk   |   8 Aug 2020 5:20 PM IST
అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఓకే అంటున్న స్టార్‌ కూతురు
X
సౌత్‌ హీరోయిన్స్‌ బాలీవుడ్‌ కు వెళ్లాలని ఆశ పడుతూ ఉంటారు. కాని బాలీవుడ్‌ హీరోయిన్స్‌ మాత్రం చాలా తక్కువ సందర్బాల్లో మాత్రమే సౌత్‌ పై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సౌత్‌ సినిమాల్లో నటించేందుకు చాలా మంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ఆసక్తిగా లేరు అనడంలో సందేహం లేదు. ఒక వేళ ఓకే చెప్పినా కూడా వారి పారితోషికం వింటే బాబోయ్‌ అనేట్లుగా ఉంటుంది. సౌత్‌ స్టార్‌ హీరోయిన్స్‌ ఒక్కరు ఇద్దరు బాలీవుడ్‌ కు వెళ్లి సక్సెస్‌ అయ్యారు. ఇక ఉత్తరాది ముద్దుగుమ్మలు అక్కడ నుండి వచ్చి ఇక్కడ సెటిల్‌ అవ్వడం జరగలేదు. కాని అనన్య మాత్రం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తానంటోంది.

బాలీవుడ్‌ స్టార్‌ చుంకీ పాండే కూతురు అయిన అనన్య పాండే ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌ లో ఆఫర్లు దక్కించుకుంటుంది. కరణ్‌ జోహార్‌ వంటి అండ దండలతో ఈ అమ్మడు ఆఫర్లు తెచ్చుకుంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో కలిసి ఫైటర్‌ చిత్రంలో పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయ్యింది. ఆ సినిమాకు సంబంధించి షూటింగ్‌ కోసం అనన్య ఎదురు చూస్తున్నట్లుగా ప్రకటించింది. ఇదే సమయంలో తెలుగులో ఈమెకు వచ్చిన ఆఫర్లను వద్దనకుండా పరిశీలిస్తుందట.

కథ మరియు ఇతర విషయాలు నచ్చితే తప్పకుండా నటిస్తానంటోంది. బాలీవుడ్‌ లో ఆఫర్లు వస్తున్నా కూడా సౌత్‌ లో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్న అనన్య పాండేను చూస్తుంటే ముచ్చటేస్తోంది. టాలీవుడ్‌ బాలీవుడ్‌ అనే తేడా లేకుండా సినిమాలు చేయాలనుకుంటున్న అనన్య పాండే భవిష్యత్తులో మంచి సక్సెస్‌ అవుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.