Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: క‌జుర‌హో శిల్పానివో

By:  Tupaki Desk   |   4 Nov 2018 1:30 AM GMT
ఫోటో స్టోరీ: క‌జుర‌హో శిల్పానివో
X
క‌జుర‌హో శిల్ప సంప‌ద గురించి ప్ర‌త్యేకించి గుర్తు చేయాల్సిన ప‌నేలేదు. దేవాల‌యాల‌పై ప్రాచీన శిల్ప సంప‌ద ఇప్ప‌టికీ అంతే అందంగా నిక్షిప్త‌మై ఉంది. బుద్ధులు - జైనుల కాలం నుంచి ఉన్న శిల్ప‌క‌ళ‌కు ప్ర‌తిరూపాలుగా నిలుస్తున్నాయి. ఇంత ఇంట్ర‌డ‌క్ష‌న్‌ ఎందుకంటే .. ఇక్క‌డ క‌నిపిస్తున్న ఈ అందాన్ని చూశాక క‌జుర‌హో శిల్ప‌మా? బ్ర‌హ్మ ఉలి వేసి చెక్కిన అందాల శిల్ప‌మా? అంటూ ఆశ్చ‌ర్య‌పోవాల్సొచ్చింది కాబ‌ట్టి.

యువ‌త‌రం ఫాంట‌సీ లోకంలో తేలిపోయే శిల్ప సంప‌ద ఈ అమ్మ‌డి దేహ‌శిరుల్లో దాగి ఉంది. సింపుల్ డ్రెస్‌ లో నాభి సౌంద‌ర్యాన్ని అంతే అందంగా ఎలివేట్ చేస్తోంది ఈ భామ‌. తీరైన రూపంతో తీర్చిదిద్దిన అందంతో యువ‌త‌కు మ‌తి చెడ‌గొడుతోంది. మునుముందు బాలీవుడ్‌ ని ఓ ఊపు ఊపేందుకు రెడీ అవుతున్న ఈ సుంద‌రి నామ‌ధేయం అన‌న్య పాండే. బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు చుంకీ పాండే న‌ట‌వార‌సురాలిగా బ‌రిలో దిగుతోంది. ల‌క్కీ హ్యాండ్ క‌ర‌ణ్ జోహార్ ఈ భామ‌ను కూడా ప‌రిచ‌యం చేస్తున్నాడు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2` చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ఇప్ప‌టికే అనన్య‌కు వీర‌లెవల్లో ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ట్విట్ట‌ర్ - ఇన్‌ స్టాలో రెగ్యుల‌ర్‌ గా ఈ భామ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు లేటెస్టు ఫోటోషూట్ల‌తో అల‌రిస్తోంది. పండ‌గ‌లు ప‌బ్బాలు వ‌స్తే డిజైన‌ర్లు - స్టార్లు ఇచ్చే పార్టీల్లో త‌ల‌మున‌క‌లుగా మునిగి తేలుతోంది. లేటెస్టుగా డిజైన‌ర్ సందీప్ ఖోస్లా ఇచ్చిన ముంద‌స్తు దీపావ‌ళి పార్టీలో ఇలా త‌ళుక్కుమంది. క్రీగంటి చూపుతో పార్టీ బోయ్స్‌ ని కోసేసిందంతే.