Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: నా ఒళ్లు సింగారం కాను!

By:  Tupaki Desk   |   8 Oct 2018 10:55 AM GMT
ఫోటో స్టోరీ: నా ఒళ్లు సింగారం కాను!
X
నీ ఇల్లు బంగారం కాను.....! డిస్కుం! నా ఒళ్లు సింగారం కాను....!! డిస్కుం! ఓ అప్పారావు..ఓ సుబ్బారావు.. ఎవరో ఎవరో వస్తారంటే నువ్వొచ్చావా? ఐనా కానీ ..రెడీ రెడీ.. రెడీ రెడీ... ఆ రోజుల్లో జ‌య‌మాలిని, జ్యోతిల‌క్ష్మి లాంటి ఐటెమ్ భామ‌ల వ‌య్యారానికి ప‌డిపోని కుర్రాళ్లు ఉన్నారు. ఈ భామ అంత‌కుమించి అని ప్రూవ్ చేస్తోంది. ఈ వ‌న్నెచిన్న‌ల వ‌య్యారి భామ పేరేంటి? అంటే.. అన‌న్య పాండే. న‌టుడు చుంకీ పాండే న‌ట‌వార‌సురాలు.

ఇంకా క‌నీసం డెబ్యూ సినిమా అయినా రిలీజ్ కాలేదు. ఇంత‌లోనే అన‌న్య‌ ఇలా అదిరిపోయే ఫోజుల‌తో మ‌తి చెడ‌గొడుతోంది. జయమాలిని వ‌య్యారం నాలో ఉంది చూస్కో.. అంటూ తెగ హొయ‌లు పోతోంది. బ్యాక్ లెస్ ఫోజులో రెచ్చ‌గొడుతోంది. స‌హ‌జంగానే ఫోటోగ్రాఫ‌ర్లు అలా వెంట‌ప‌డుతుంటే.. ఎస్కేప్ అయిపోతారు కొంద‌రు భామ‌లైతే. మ‌రికొంద‌రైతే అయ్య‌య్యో అలా చేయ‌డం త‌ప్పు! అని వారించే ప్ర‌య‌త్నం చేస్తారు. కానీ త‌న‌కు మాత్రం ఏమాత్రం మొహ‌మాటం, సిగ్గు బిడియం లేనేలేద‌ని చెప్ప‌క‌నే చెబుతోంది ఈ బ్యూటీ.

అస‌లే యంగ్ టీనేజీ గాళ్. ఆపై గుండె గుల్ల చేసే అందం. ఇంకేం ఉంది.. బ్యాక్‌ లెస్ లో క‌నిపిస్తే ఆగుతాయా కెమెరా క‌ళ్లు. తళుక్కుమ‌ని ఫ్లాష్‌ లు మెరిపించ‌వూ? ఇటీవ‌లే ఎల్లే బ్యూటీ అవార్డ్స్ 2018 వేడుక‌లకు ఎటెండయిన ఈ భామ చుట్టూనే క‌ళ్ల‌న్నీ ప్ర‌స‌రించాయి. క‌ర‌ణ్ జోహార్ ఈ భామ‌ను కూడా బాలీవుడ్‌ కి ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఆలియా న‌టించిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్-2` (సీక్వెల్) చిత్రంలో న‌టిస్తోంది. అప్పుడు ఆలియా స‌క్సెస్. ఈసారి అన‌న్య వంతు. తొలి సినిమా రిలీజైతే ఇంకే రేంజులో చెల‌రేగిపోతుందా?