Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరు హాట్ స్టూడెంట్లు వీళ్లే

By:  Tupaki Desk   |   11 April 2018 10:38 AM GMT
ఆ ఇద్దరు హాట్ స్టూడెంట్లు వీళ్లే
X
బాలీవుడ్లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఒకేసారి ముగ్గురు టాలెంటెడ్ ఆర్టిస్టులను ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు డైరెక్టర్ కరణ్ జోహార్. వాళ్లే సిద్ధార్థ్ మల్హోత్రా - అలియా భట్ మరియు వరుణ్ ధావన్. ముగ్గురు ఇప్పుడు బాలీవుడ్లో బాగానే సెటిల్ అయ్యారు. కాలేజ్ నేపథ్యంలో సాగే ఆ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకోవడమే కాక పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రాబోతోంది.

మొదటి సినిమాలో ముగ్గురు కొత్తవాళ్లనే తీసుకున్న కరణ్ ఇప్పుడు హీరోగా టైగర్ ష్రాఫ్ ను తీసుకున్నాడు. హీరోయిన్లు ఎవరా అని ఫాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పుడు ఇద్దర్ని కొత్త అమ్మాయిలనే తీసుకుంటారని తెలిసింది. ఆ హీరోయిన్లు వీళ్ళే అని పలు రూమర్లు వచ్చినప్పటికీ, ఆఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా ఆ రుమర్లకు చెక్ పెట్టారు దర్శకనిర్మాతలు. టైగర్ తో స్క్రీన్ పైన రొమాన్స్ చేయబోయే ఆ ఇద్దరు భామలు అనన్య పాండే అండ్ తార సుతారియా. అనన్య ఎవరో కాదు.. విలన్ అండ్ కామెడీ వేషాలు వేసే చుంకీ పాండే కూతురు. ఈ సినిమా ద్వారా నటిగా తెరంగేట్రం చేయబోతోంది.

డిస్నీ ఛానల్ లో విజే గా పాపులర్ అయిన సింగర్ మరియు డాన్సర్ తార. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫాన్స్ కి పోస్టర్ విడుదల చేయడంతో ఆనందంగా ఉన్నారు. పోస్టర్ లోనే గ్లామర్ ఆరబోతలో మేము ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టు పోజ్ ఇస్తున్నారు. మరి తెరపైన ఇంకెలా కనిపిస్తారో చూడాల్సిందే..