Begin typing your search above and press return to search.

సేమ్ డ్రెస్సులో స్టార్ కిడ్స్.. పోటీ తప్పలేదే!

By:  Tupaki Desk   |   10 Jun 2019 2:33 PM GMT
సేమ్ డ్రెస్సులో స్టార్ కిడ్స్.. పోటీ తప్పలేదే!
X
ఫ్యాషన్ ప్రపంచంలో స్టైల్స్ ఎప్పుడూ మారుతుంటాయి. ఫ్యాషన్ ను ఎక్కువగా ఫాలో అయ్యే బాలీవుడ్ హీరోయిన్లు ఒకసారి వేసుకున్న డ్రెస్ మరోసారి వేసుకోరు. ఇక కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో స్పెషల్ డిజైనర్ వేర్ ను ఎంపిక చేసుకుంటారు. ఇలాంటి డ్రెస్సులలో కూడా ఒకసారి ఎవరైనా సెలబ్రిటీ వేసుకుంటే అదే డ్రెస్ ను మరో సెలబ్రిటీ ధరించేందుకు ఇంట్రెస్ట్ చూపించరు. ఒకవేళ అలా ఒకేవిధంగా ఉండే దుస్తులు ధరిస్తే పోలికలు తప్పవు.

ఈమధ్యే బాలీవుడ్ లోని స్టార్ కిడ్స్ అనన్య పాండే.. ఖుషి కపూర్ ల మధ్య అలాంటి పోలికే వచ్చింది. ఎలి మ్యాగజైన్ ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజిపై అనన్య పాండే టామీ హిల్ ఫిగర్ వారి జెండాయా క్యాప్సూల్ కలెక్షన్ లోని ఒక 3 పీస్ డ్రెస్ ను ధరించింది. అయితే అలాంటి డ్రెస్సునే చిన్నపాటి మార్పుతో శ్రీదేవి చిన్నకూతురు ఖుషి కపూర్ ఈమధ్య 'భారత్' సినిమా ప్రీమియర్ సందర్భంగా ధరించింది. దీంతో ఈ డ్రెస్ ను ఎవరు అందంగా ధరించారు? ఎవరు ఈ డ్రెస్ లో స్టైలిష్ గా ఉన్నారని చర్చ మొదలైంది.

ఇద్దరి డ్రెస్ లో ఉన్న ఒకే తేడా ఏంటంటే షర్టు. అనన్య ధరించిన డ్రెస్ లో ప్యాంట్..బ్లేజార్.. షర్టు అన్ని ఒకే డిజైన్. అయితే ఖుషి మాత్రం సూటు ప్యాంట్ అదే ఉంచి లోపల వేసుకున్న షర్టును మార్చేసింది.. ఆ షర్టు కుబదులుగా బ్రౌన్ కలర్ టీ షర్టును ధరించింది. ఇద్దరి మధ్య పోటీలో ఎక్కువమంది ఖుషికి ఓటు వేశారు. అనన్యకు తక్కువ ఓట్లు పడ్డాయి. దీనికి నెటిజన్లు చెప్పే లాజిక్ ఏంటంటే అనన్య మరీ స్లిమ్ గా ఉందని.. అనన్య ఫోటో మ్యాగజైన్ కవర్ పేజి కోసం చేసిన ఫోటో షూట్ కాబట్టి ఎంతో జాగ్రత్తగా చేస్తారని. అదే ఖుషి న్యాచురల్ గా నిలబడిందని.. పైగా ఖుషి తన డ్రెస్ లో చేసిన మార్పు కొత్తగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన శ్రీదేవి చిన్న కూతురు సినిమాల్లోకి రాకముందే ఫ్యాషన్ విషయంలో స్పెషలిస్ట్ గా మారిపోయిందన్న మాట. అక్క జాన్విని మించిపోయేలా ఉందే!