Begin typing your search above and press return to search.

'ఫైట‌ర్' జోడీ జాన్వీ కాదు.. ఇంకెవ‌రు?

By:  Tupaki Desk   |   12 Feb 2020 7:15 AM GMT
ఫైట‌ర్ జోడీ జాన్వీ కాదు.. ఇంకెవ‌రు?
X
రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఫైట‌ర్` సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` రిలీజ్ ప్ర‌చారంలో విజ‌య్ బిజీ బిజీగా ఉన్నాడు. నేటితో (బుధ‌వారం) ఆ ప‌నులు ముగించుకుని గురువారం నుంచి మ‌ళ్లీ య‌థావిధిగా ఫైట‌ర్ షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ గ్యాప్ లో పూరి అండ్ టీమ్ ఇత‌ర న‌టీ న‌టుల‌పై షూటింగ్ చేస్తున్నారు. అయితే ఇంతవ‌ర‌కూ విజ‌య్ కి హీరోయిన్ ని ఫిక్స్ చేయ‌లేదు. సోష‌ల్ మీడియాలో ఫ‌లానా హీరోయిన్ ఎంపికైంది అన్న పుకార్లు త‌ప్ప హీరోయిన్ ఖాయ‌మైంద‌న్న అధికారిక వార్త‌ యూనిట్ నుంచి రాలేదు.

అతిలోక సుంద‌రి శ్రీదేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ ని ఎంపిక చేసిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. విజ‌య్ పై జాన్వీ కి క్ర‌ష్ ..పైట‌ర్ కు ప‌ర్ పెక్ట్ పెయిర్ గా సెట్ అవుతుంద‌ని పూరి ఏరికోరి మ‌రీ జాన్వీని బ‌రిలో దించార‌ని ప్ర‌చార‌మైంది. అయితే జాన్వీ డేట్లు స‌ర్దుబాటు కాక పోవ‌డంతో ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసింద‌న్న సంగ‌తి అంతే ఇదిగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. మ‌రి ఇందు లో ఏది నిజం? అన్న‌ది యూనిట్ వ‌ర్గాలు వెల్ల‌డించాల్సి ఉంటుంది. తాజాగా ఈ ప్రచార‌ ప‌రంప‌ర‌లో మ‌రో బాలీవుడ్ బ్యూటీ పేరు తెర‌ పైకి వ‌చ్చింది. యువ నాయిక‌.. మ‌రో న‌ట‌ వార‌సురాలు అనన్య పాండేని పూరి- ఫైట‌ర్ కోసం ఎంపిక చేసాడ‌ని కొత్త ప్ర‌చారం మొద‌లైంది.

ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌రిస్తున్న బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ స‌ల‌హా మేర‌కు అనన్య‌ను పూరి ఎంపిక చేసిన‌ట్లు బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. అన‌న్య పాండేని బాలీవుడ్ లో ప‌రిచ‌యం చేసింది క‌ర‌ణ్ జోహ‌రే. ఆయ‌న నిర్మాత‌గా వ్య‌వ‌రించిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ -2 ` చిత్రంతోనే అక్క‌డ‌ తెర‌కు ప‌రిచ‌య‌మైంది. గ‌తేడాది విడుద‌లైన సినిమాలో అమ్మ‌డి న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. బాక్సాఫీస్ వ‌ద్ద క‌మ‌ర్శియ‌ల్ గాను ఓకే అనిపించింది. అన‌న్య‌కు యూత్ లో క్రేజు నెలకొన్న నేప‌థ్యంలో `ఫైట‌ర్`కి జోడీగా అన‌న్య అయితే బావుంటుంద‌ని క‌ర‌ణ్ సూచించార‌ని కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది.