Begin typing your search above and press return to search.

స్మోకింగ్ చేస్తూ అడ్డంగా దొరికేసిన హీరోయిన్

By:  Tupaki Desk   |   16 March 2023 11:30 AM IST
స్మోకింగ్ చేస్తూ అడ్డంగా దొరికేసిన హీరోయిన్
X
బాలీవుడ్ లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ అనన్యా పాండే. ఒకప్పటి స్టార్ యాక్టర్ చుంకీ పాండే కూతురుగా ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి నెపో కిడ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు మొదటి సినిమాతో ఆకట్టుకోవడంతో తరువాత అడపాదడపా అవకాశాలు భాగానే వస్తున్నాయి. ఇక ఈ బ్యూటీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ లో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా డిజాస్టర్ కావడంతో తెలుగు ప్రేక్షకులకి అనన్యా పాండే చేరువ కాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ డ్రీమ్ గర్ల్ 2 మూవీలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు బాలీవుడ్ లో ఆషికి2 హీరోతో డేట్ లో ఉందనే మాట చాలా కాలంగా వినిపిస్తుంది. రెగ్యులర్ లో బాలీవుడ్ పార్టీస్ లో ఇద్దరు కలిసి కనిపిస్తూ ఉండటం ఈ ప్రచారానికి కారణం అని చెప్పాలి.

ఇదిలా ఉంటే ఇదిలా ఈ బ్యూటీకి సంబందించిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. తన ఫ్యామిలీకి సంబందించిన మ్యారేజ్ వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన అనన్యా పాండే సీక్రెట్ లో ఓ పక్కకి వెళ్లి సిగరెట్ తాగుతుంది. ఈ ఫోటో రీడిట్ లో ప్రత్యక్షం అయ్యింది. అయితే దానిని మరల తొలగించేలోపే చాలా మంది స్క్రీన్ షాట్స్ తీసుకొని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం మొదలు పెట్టారు. హీరోయిన్ ఇలా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లో సిగరెట్ తాగడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అనన్యా పాండే సిగరెట్ తాగుతుందని నేను అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు అని ఒక యూజర్ కామెంట్ పెట్టారు. అనన్యా చాలా అందమైన పెదవులతో కనిపిస్తూ ఉంటుంది. కాని ఆమె సిగరెట్ కూడా తాగుతుందని నేను ఊహించలేదు. ఇక అనన్యా పాండే సిగరెట్ తాగడంపై ఆశ్చర్యం కలిగించింది అంటూ మరికొంత మంది యూజర్స్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.