Begin typing your search above and press return to search.

వార‌సత్వ భామ‌ల పోటీపై క్యూటీ మాట‌

By:  Tupaki Desk   |   18 Dec 2019 5:30 PM GMT
వార‌సత్వ భామ‌ల పోటీపై క్యూటీ మాట‌
X
ప్ర‌స్తుతం బాలీవుడ్ లో న‌ట‌వార‌సుల మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను మంది భామ‌లు అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు. మునుముందు ఈ పోటీ మ‌రింత‌గా పెర‌గ‌నుంది. ఇప్ప‌టికిప్పుడు జాన్వీ క‌పూర్ - సారా అలీఖాన్ డెబ్యూ నాయిక‌లుగా నిరూపించుకుని క్ష‌ణం తీరిక లేనంత బిజీ లైనప్ తో కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్నారు. ఆ త‌ర్వాతా బాలీవుడ్ కి ప‌రిచ‌యమైన అన‌న్య పాండే.. తారా సుతారియా అంతే బిజీగా ఉన్నారు.

అయితే ఇంత‌మందితో పోటీ గురించి `ప‌తి ప‌త్ని ఔర్ వో` బ్యూటీ అన‌న్య పాండేని ప్ర‌శ్నిస్తే.. ఈ అమ్మ‌డు ఇచ్చిన ఆన్స‌ర్ స‌ర్ ప్రైజ్ చేస్తోంది. మా మ‌ధ్య పోటీ ఉన్న మాట వాస్త‌వం. కానీ మేమంతా స‌హోద్యోగులం. ఒకే స్కూల్లో చ‌దువుకున్నాం. వృత్తిప‌రంగా పోటీప‌డుతున్నాం. అయినా మేమంతా స్నేహితులులానే క‌లిసి మెలిసి ఉంటామ‌ని తెలిపింది.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయిన‌ అనన్య పాండే ప్ర‌స్తుతం రెండో సినిమా `ప‌తి ప‌త్ని ఔర్ వో` చిత్రంలో న‌టించింది. ఈ సంద‌ర్భంగా ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో పైవిధంగా వ్యాఖ్యానించింది. ఇక ఇత‌ర న‌టీమ‌ణుల‌తో త‌న‌కు పోటీ ఉన్నా.. శత్రుత్వం లేదని చెప్పింది. సారా- జాన్వీ ల‌ను కలిసినప్పుడు చాలా మామూలుగా మాట్లాడుకుంటాం. సారా.. నేను ఒకే స్కూల్ కు వెళ్లాం. జాన్వీ నా స్నేహితురాలు. కలిసి పరిశ్రమలో పనిచేస్తున్నాం అని అన‌న్య పేర్కొంది.

కార్తీక్ ఆర్యన్- భూమి పెడ్నేకర్ జంట‌గా నటించిన `ప‌తి ప‌త్ని ఔర్ వో` చిత్రంలో అనన్య న‌ట‌న‌కు పేరొచ్చింది. ఈ భామ‌ తదుపరి ఇషాన్ ఖత్త‌ర్ స‌ర‌స‌న `ఖాలీ పీలీ` అనే చిత్రంలో న‌టిస్తోంది. మరోవైపు సారా అలీఖాన్.. కార్తీక్ స‌ర‌స‌న `ల‌వ్ ఆజ్ కల్` సీక్వెల్లో నటిస్తుండ‌గా.. జాన్వి ప్రస్తుతం దోస్తానా 2 షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.