Begin typing your search above and press return to search.

వ‌కీల్ సాబ్ బ్యూటీకి పెళ్లా..? భ‌లే రిప్లై ఇచ్చిందే!

By:  Tupaki Desk   |   2 Oct 2022 1:30 PM GMT
వ‌కీల్ సాబ్ బ్యూటీకి పెళ్లా..? భ‌లే రిప్లై ఇచ్చిందే!
X
`మ‌ళ్లేశం` సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన తెలుగు చిన్న‌ది అన‌న్య నాగ‌ళ్ల‌. తొలి చిత్రంతో ఫ‌ర‌వాలేద‌నిపించిన అన‌న్య ఆ త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `వ‌కీల్ సాబ్‌`తో మ‌రింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇంజినీరింగ్ పూర్తి చేసి సినిమాల్లోకి ప్ర‌వేశించిన అన‌న్య ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తోంది. ఈ ఏడాది త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కాబోతోంది. ఇటీవ‌లే త‌న త‌మిళ సినిమా షూటింగ్ లాంఛ‌నంగా మొద‌లైంది కూడా.

నిత్యం సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌దైన మార్కు ఫోటోల‌తో ఆక‌ట్టుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్న అన‌న్య తాజాగా మ‌రో సారి వార్త‌ల్లో నిలిచింది. ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ సినిమాల‌తో బిజీగా వున్న అన‌న్య నాగ‌ళ్ల త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతోంద‌ని, ఓ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ తో పెళ్లికి సిద్ధ‌మ‌వుతోందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అన‌న్య నాగ‌ళ్ల సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇచ్చిన రిప్లై ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌న పెళ్లి వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని స్ప‌ష్టం చేసిన అన‌న్య పెళ్లి కొడుకు పేరు, పెళ్లి తేదీ చెప్పాలంటూ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా ఎదురు ప్ర‌శ్నించింది. `అబ్బాయిలూ నా కోసం వ‌రుడిని ఎంపిక చేసినందుకు ధ‌న్య‌వాదాలు. కానీ ద‌య‌చేసి పెళ్లి తేదీతో పాటు పెళ్లి కొడుకు ఎవ‌రో నాకు కూడా చెప్పండి అప్పుడే నా వివాహానికి హాజ‌ర‌య్యే అవ‌కాశం వుంటుంది` అంటూ త‌న పెళ్లి పుకార్ల‌పై సెటైరిక‌ల్ గా స్పందించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అన‌న్య నాగ‌ళ్ల న‌టించిన లేటెస్ట్ మైథ‌లాజిక‌ల్ డ్రామా `శాకుంత‌లం`. స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ మూవీని స్టార్ డైరెక్ట‌ర్ గుణశేఖ‌ర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని న‌వంబ‌ర్ 4న పాన్ ఇండియా మూవీగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో 3డీ వెర్ష‌న్ లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ మూవీపై అన‌న్య భారీ ఆశ‌లే పెట్టుకుంది.