Begin typing your search above and press return to search.

అన‌న్య‌ న‌వ్వుతూనే సెగ‌లు పుట్టిస్తోందిగా!

By:  Tupaki Desk   |   4 Sep 2022 4:32 PM GMT
అన‌న్య‌ న‌వ్వుతూనే సెగ‌లు పుట్టిస్తోందిగా!
X
గ్లామర్ రంగం ఆనుపానులు కనిపెట్టడం అంత సులువు కాదు. ఒకసారి విషయం అర్థమైతే అల్లుకుపోవడం అనేది తారల సత్తాను బట్టి ఉంటుంది. నటనలో నిరూపిస్తూనే గ్లామర్ షోలతో జనాల్ని ఆకట్టుకోవాలి. నిరంతరం తమ చుట్టూ వైఫైలా `ఆరా`ను వర్కవుట్ చేయాలి. మీడియా అటెన్షన్ ని తమ వైపు తిప్పుకోవాలి. ఈ విషయంలో ఇప్పటికే పలువురు తెలుగమ్మాయిలు ఎంతో స్పీడ్ మీద ఉన్నారు.

ఇప్పుడిదే బాటలో నైజాం గాళ్ అనన్య నాగళ్ల కూడా దూసుకుపోతోంది. ఈ ఖమ్మం బ్యూటీ పరిశ్రమకు వచ్చి చకచకా తొలి అడుగులు వేస్తోంది. వకీల్ సాబ్ లో తన పాత్రతో మెప్పించిన ఈ బ్యూటీ అంతకుముందు మల్లేశం చిత్రంలోనూ అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఇప్పటికిప్పుడు వరుస చిత్రాలతో బిజీ అవుతోంది. పనిలో పనిగా యువతరాన్ని ఆకర్షించే హాటెస్ట్ ఫోటోషూట్లతో గుబులు రేపుతోంది. అనన్య తాజా ఫోటోషూట్ వీడియోలో గ్లామర్ యాంగిల్ ని ఓ రేంజ్ లో ఆక‌ర్షిస్తోంది.

సింపుల్ ప్ల‌వ‌ర్ డిజైన్ ఫ్లోరల్ ఫ్రాకులో ప్రత్యక్షమై రకరకాల భంగిమల్లో హొయలు పోయిన తీరు మత్తులోకి దించేస్తోంది. క్యూట్ స్మైల్ అండ్ రొమాంటిక్ ఎక్స్ ప్రెష‌న్స్ తో యువ‌తో అగ్గిరాజేస్తుంది. ప్ర‌కృతి అందాల మ‌ధ్య‌లో అన‌న్య ఎలివేష‌న్లు వావ్ అనిపిస్తున్నాయి. మునుపెన్న‌డు చూడ‌ని కొత్త భామ‌ని ప‌రిచ‌యం చేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తుంది.

అయితే ఇలాంటి వీడియో చేయ‌డం తొలిసారి కాదు. ఈ మ‌ధ్య‌నే ఇలాంటి వీడియో ఒక‌టి చేసింది. దానికి ఇన్ స్టాలో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అమ్మ‌డి ఫాలోవ‌ర్స్ ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. దీంతో మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్న‌మే చేసింది. ఈ మ‌ధ్య కాలంలో బ్యూటీలు ఇన్ స్టా ద్వారానూ బాగానే ఆర్జిస్తున్నారు. ఇన్ స్టాలో ఫేమ‌స్ లక్ష‌లు వెన‌కేస్తున్నారు. ఆ క్రేజ్తో సినిమా అవ‌కాశాలు బాగానే ద‌క్కించుకుంటున్నారు.

ఆ రకంగా తెలంగాణ పిల్ల‌కి బాగానే వ‌ర్కౌట్ అవుతుందేమే. అన‌న్య సినిమాల సంగ‌తి చూస్తే..సమంత టైటిల్ పాత్ర పోషించిన శాకుంతలం చిత్రంలో అనన్య కీలక పాత్రను పోషించింది. గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలోనే మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.