Begin typing your search above and press return to search.

మెల్లి మెల్లిగా ఓపెన‌వుతున్న తెలుగ‌మ్మాయ్!

By:  Tupaki Desk   |   4 Jun 2022 2:30 PM GMT
మెల్లి మెల్లిగా ఓపెన‌వుతున్న తెలుగ‌మ్మాయ్!
X
గ్లామ‌ర్ రంగం ఆనుపానులు క‌నిపెట్ట‌డం అంత సులువు కాదు. ఒక‌సారి విష‌యం అర్థ‌మైతే అల్లుకుపోవడం అనేది తార‌ల స‌త్తాను బ‌ట్టి ఉంటుంది. నట‌న‌లో నిరూపిస్తూనే గ్లామ‌ర్ షోల‌తో జ‌నాల్ని ఆక‌ట్టుకోవాలి. నిరంత‌రం త‌మ చుట్టూ వైఫైలా `ఆరా`ను వ‌ర్క‌వుట్ చేయాలి. మీడియా అటెన్ష‌న్ ని త‌మ వైపు తిప్పుకోవాలి. ఈ విష‌యంలో ఇప్ప‌టికే ప‌లువురు తెలుగ‌మ్మాయిలు ఎంతో స్పీడ్ మీద ఉన్నారు.

ఇప్పుడు ఇదే బాట‌లో నైజాం గాళ్ అన‌న్య నాగ‌ళ్ల కూడా దూసుకుపోతోంది. ఈ ఖ‌మ్మం (స‌త్తుప‌ల్లి) బ్యూటీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి చ‌క‌చ‌కా తొలి అడుగులు వేస్తోంది. వ‌కీల్ సాబ్ లో త‌న పాత్ర‌తో మెప్పించిన ఈ బ్యూటీ అంత‌కుముందు మ‌ల్లేశం చిత్రంలోనూ అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఇప్ప‌టికిప్పుడు వ‌రుస చిత్రాల‌తో బిజీ అవుతోంది. ప‌నిలో ప‌నిగా యువ‌త‌రాన్ని ఆక‌ర్షించే హాటెస్ట్ ఫోటోషూట్ల‌తో గుబులు రేపుతోంది. అన‌న్య తాజా ఫోటోషూట్ లో గ్లామ‌ర్ యాంగిల్ విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.

సింపుల్ ఫ్లోర‌ల్ ఫ్రాకులో ప్ర‌త్య‌క్ష‌మై ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో హొయ‌లు పోయిన తీరు మ‌త్తులోకి దించేస్తోంది. ఎంపిక చేసిన డిజైన‌ర్ ఫ్రాకుకు కాంబినేష‌న్ గా మెడ‌లో ముత్యాల‌ హారం జ‌త కుదిరింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ యువ‌త‌రంలో వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి. అమ్మ‌దొంగా స‌త్తుప‌ల్లి పిల్ల స్పీడ్ పెంచింది! అంటూ ఒక‌రు..ఇంత‌లోనే ఎంత స్పీడ్ పెంచింది! అంటూ మ‌రొక‌రు.. మెల్లి మెల్లిగా ఓపెన‌వుతున్న తెలుగ‌మ్మాయ్! అంటూ ఇంకొక‌రు అన‌న్య‌లో మార్పు గురించి ప్ర‌స్థావిస్తున్నారు. ఫ్యాన్స్ అన‌న్య‌లో గ్లామ‌ర్ యాంగిల్ కి ఎంతో ఎగ్జ‌యిట్ అవుతున్నారు. స‌మంత టైటిల్ పాత్ర పోషించిన శాకుంత‌లం చిత్రంలో అన‌న్య కీల‌క పాత్ర‌ను పోషించింది. గుణ‌శేఖ‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. త్వ‌ర‌లోనే మూవీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.