Begin typing your search above and press return to search.

అనన్య ఎద‌పై ఆ పూవు నేనైతే ..!

By:  Tupaki Desk   |   11 Dec 2021 11:30 PM GMT
అనన్య ఎద‌పై ఆ పూవు నేనైతే ..!
X
తెలుగమ్మాయి అన‌న్య నాగాళ్ల‌ ప‌రిచ‌యం అవ‌స‌రంలేదు. `మ‌ల్లేశం` చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ బ్యూటీ అటుపై `ప్లే బ్యాక్`..`వ‌కీల్ సాబ్`..`మాస్ట్రో` చిత్రాల్లో న‌టించింది. `మ‌ల్లేశం` తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా కానీ అటుపై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ట‌ర్న్ తీసుకుంది. అగ్ర హీరోల సినిమాల్లో నేరుగా హీరోయిన్ ఛాన్స్ రాక‌పోవ‌డంతో త‌న‌వైపు వ‌చ్చిన అవ‌కాశాల్ని తెలివిగా స‌ద్వినియోగం చేసుకుంటోంది.

టాలీవుడ్ లోక‌ల్ ట్యాలెంట్ ని ఎంక‌రేజ్ చేయ‌దు అన్న వాస్త‌వం అన‌న్య విషయంలోనూ ప్రూవ్ అవుతోంద‌ని భావిస్తున్నారు. అలాగ‌ని యంగ్ బ్యూటీ నిరుత్సాహ ప‌డ‌లేదు. వ‌చ్చిన అవ‌కాశాల్ని వినియోగించుకుంటూ ముందుకు సాగిపోతోంది.

ప్ర‌స్తుతం `శాకుంతలం`లో న‌టిస్తోంది. ఇది లేడీ ఓరియేంటెడ్ చిత్రం. ఇందులో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నుంది. మ‌రి అన‌న్య రోల్ ప్రాధాన్య‌త ఏంటి? అన్న‌ది తెలియాల్సి ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఈ ఒక్క సినిమానే అన‌న్య చేతిలో ఉంది. కొత్త అవ‌కాశాలైతే చేతిలో లేవు. ఇక ఈ బ్యూటీ ఇన్ స్టాలో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. బోల్డ్ యాంగిల్ కి దూరంగా ఉంటూనే యువ‌త అటెన్ష‌న్ ని డ్రా చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. తాజాగా ఓ కొత్త ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది.

ఇందులో అన‌న్య షోల్డ‌ర్ లెస్ గౌనులో మెరిపిస్తోంది. అలా త‌న‌ అందాల్ని పూల దండ‌ల‌తో క‌వ‌రప్ చేసింది. ఆ పూల రంగులో క‌లిసోయే పింక్ గౌన్ ధ‌రించింది. అలా మ‌త్తుగా క‌ళ్లు మూసుకుని స్టాండింగ్ పొజిష‌న్ లో కెమెరాకి ఫోజులిచ్చింది. క‌నురెప్ప‌లపై..పెద‌వుల‌పై లిప్ స్టిక్ అద్దిన తీరు క్యూట్ గా క‌నిపిస్తోంది. నియాన్ కాంతుల్లో అన‌న్య ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది.

తాజా ఫోటోషూట్ ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఐల‌వ్ యూ బేబి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఐయామ్ కమింగ్ విత్ ప్ల‌వ‌ర్స్.. ఆ ప్ల‌వ‌ర్స్ నేనే అయితే ఎంత బాంగుడు! అంటూ కామెంట్ చేసాడు. యూత్ ని అంత‌గా క‌వ్విస్తున్న ఈ బ్యూటీ కెరీర్ మునుముందు మ‌రింత స్పీడందుకుంటుంద‌నే భావిద్దాం.