Begin typing your search above and press return to search.

2022 NYE సెల‌బ్రేష‌న్ లో అన‌న్య నాగ‌ళ్ల‌

By:  Tupaki Desk   |   1 Jan 2022 1:49 PM GMT
2022 NYE సెల‌బ్రేష‌న్ లో అన‌న్య నాగ‌ళ్ల‌
X
టాప్ సెల‌బ్రిటీలంతా విదేశీ వెకేషన్ల‌తో చిలౌట్ చేస్తున్నారు. హీరోయిన్లంతా న్యూఇయ‌ర్ వేడుక‌ల్ని గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా తెలంగాణ బ్యూటీ అన‌న్య నాగ‌ళ్ల‌ కొత్త ఏడాది 2022కి గ్రాండ్ గా వెల్క‌మ్ చెప్పింది. నైట్ పార్టీలో ఇలా అన‌న్య స్కిన్ టైట్ దుస్తుల్లో మెరిసింది. డార్క్ డ్రెస్ లో థై అందాల్ని ఎలివేట్ చేస్తూ కెమెరాకి విభిన్న భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. అయితే అన‌న్య పార్టీ లో ఎంజాయ్ చేయ‌డానికి వెళ్లిందా? లేక న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ లో భాగంగా క్యాలెండ‌ర్ గాళ్ గా ఫోటోషూట్ కోస‌మా? అన్న‌ది క్లారిటీ రావాలి. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో భాగంగా మీడియం రేంజ్ హీరోయిన్ల‌కు మంచి డిమాండ్ ఉంటుంది.

ప‌బ్ ల్లో పార్టీల్లో స్పెష‌ల్ అప్పీరియ‌న్స్ తో మెప్పిస్తే మంచి పారితోషికం ద‌క్కుతుంది. ఆ కోవ‌లో అన‌న్య 2022 ఎన్ వైఇ పార్టీల్లో సంద‌డి చేసిందా? అన్న‌ది తెలియాలి. ఇక అన‌న్య `మ‌ల్లేశం` సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అటుపై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ట‌ర్న్ తీసుకుంది. అగ్ర హీరోల సినిమాల్లో నేరుగా హీరోయిన్ ఛాన్స్ రాక‌పోవ‌డంతో వ‌చ్చిన అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ `వ‌కీల్ సాబ్`.. నితిన్ `మాస్ట్రో` చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం `శాకుంతలం`లో న‌టిస్తోంది. ఇది లేడీ ఓరియేంటెడ్ చిత్రం. ఇందులో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నుంది. మ‌రి అన‌న్య రోల్ ప్రాధాన్య‌త ఏంటి? అన్న‌ది తెలియాల్సి ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఈ ఒక్క సినిమానే అన‌న్య చేతిలో ఉంది. కొత్త అవ‌కాశాలైతే లేవు. ఇక ఈ బ్యూటీ ఇన్ స్టాలో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. బోల్డ్ యాంగిల్ కి దూరంగా ఉంటూనే యువ‌త అటెన్ష‌న్ ని డ్రా చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇన్ స్టాలో ఫాలోవ‌ర్స్ సంఖ్య బాగానే ఉంది.