Begin typing your search above and press return to search.
కళ్ళతో నటించే అద్భుత నటుడు ఇర్ఫానే: ప్రముఖ జర్నలిస్ట్
By: Tupaki Desk | 29 April 2020 9:30 PM ISTఅతనొక గ్లోబల్ స్టార్.. ఇండియన్ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రాసి పెట్టుకున్నాడు. ఒక ఇండస్ట్రీలోని హద్దులను చెరిపేసి గ్లోబల్ నటుడిగా ఎదిగిన తీరు ఎందరో నటులకు స్ఫూర్తిదాయకం. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే క్యాన్సర్ అతన్ని లాక్కుపోయింది. కానీ అతని నటనను మాత్రం ఏ మృత్యువు లాక్కుపోలేదు. చాలామంది నటులు కండల పై దృష్టి సారిస్తే.. ఇర్ఫాన్ ఒక్కడే కళ్లతో హావభావాలను పలికించడంపై ఫోకస్ చేశాడు. అలాంటి విలక్షణ నటుడి గురించి అనన్య భట్టాచార్య అనే ఓ జర్నలిస్ట్ ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది.
ఆమె మాట్లాడుతూ.. 2013 ఫిబ్రవరిలో ఇర్ఫాన్ సాహెబ్ బీవీ - గ్యాంగ్ స్టర్ రిటర్న్స్ టీమ్స్ తో ఉన్నాడు. స్టూడియోలో పలు టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి బయటకు నడుస్తున్నాడు. ఇర్ఫాన్ తన కారు ఎక్కబోతుండగా.. నేను ఆయన వద్దకు వెళ్లి మా వెబ్ సైట్ కోసం చిన్న ఇంటర్వ్యూ ఇస్తారా అని అడిగాను.
వెంటనే తన డ్రైవర్ ను - టీమ్ ను వెయిట్ చేయమని చెప్పి నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. కానీ ఆ రికార్డింగ్ ఫైల్ మిస్ అయిపోయింది. ఈ విషయం తెలిసిన ఇర్ఫాన్ తన ఫోన్ నంబర్ ఇచ్చి ఫ్రీగా ఉన్నప్పుడు రండి.. ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత రోజు సాయంత్రం వెళ్లి ఇంటర్వ్యూ తీసుకుని వచ్చాను. చెప్పినట్టుగానే ఇర్ఫాన్ తన ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. ఇర్ఫాన్ వ్యక్తిత్వం అంత గొప్పది. వృత్తి ముందు స్టార్ డమ్ పెద్దదేమీ కాదనుకునేవాడు. కాబట్టే ఎప్పుడూ చాలా హుందాగా ప్రవర్తించేవాడు. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. కలిసిన ప్రతీసారి ఆయన మాటలు - ఆలోచనలకు ఎంతో క్రియేటివ్ గా ఉండేవి.
సలాం బాంబేలో ఇర్ఫాన్ నటన చూశాక.. ఆ పెర్ఫామెన్స్‌ను మర్చిపోలేను. అతనితో మాట్లాడుతున్న కొద్ది.. నటన పట్ల అతనికున్న ప్రేమ వ్యక్తమయ్యేది. ఇక ఆయన కళ్ళు అద్భుతం! 2018లో ఆయన అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని ట్వీట్ చేసినప్పుడు షాక్ కి గురయ్యాను. గత రెండేళ్లుగా ఆయనను ట్విట్టర్ లో ఫాలో అవుతూనే ఉన్నాను. అలాంటి సమయంలో ఆయన మరణానికి చాలా దగ్గరగా ఉన్నానని.. అయితే ఈ అరుదైన వ్యాధి నుంచి బయటపడేందుకు పోరాడుతున్నానని చెప్పాడు. చివరిగా ఈరోజు ఆయన పోరాటం ముగిసింది. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి చాలా పెద్ద లోటు అని ఆమె ఎమోషనల్ గా తెలిపింది.