Begin typing your search above and press return to search.

వేడుకల్లో మార్పు... సెటైర్ వేసిన రైటర్

By:  Tupaki Desk   |   29 Jan 2020 11:30 PM GMT
వేడుకల్లో మార్పు... సెటైర్ వేసిన రైటర్
X
స్టేజిల మీద అప్పుడప్పుడు సెలెబ్రిటీలు తమ మదిలో మెదిలే విషయాలను బయటపెట్టేస్తూ అక్కడున్న వారిని ఆలోచింపజేస్తుంటారు. అయితే ఇటివలే రచయిత అనంత్ శ్రీరాం కూడా తన మనసులో ఉన్న ఆవేదను బయటపెట్టాడు. 'చూసీ చూడంగానే' అనే సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో పాల్గొన్న అనంత్ శ్రీరాం చేతికి ఇచ్చే ప్లాటినం డిస్క్ ల గురించి తన దైన స్టైల్ లో సెటైర్ విసిరాడు.

"ఒకప్పుడు ఆడియో ఫంక్షన్స్ జరిగేవి. వాటికి రచయితలైన మమ్మల్ని పిలిచి ఆ వేదికపై సినిమా ఆడియో క్యాసెట్టు ఇచ్చేవారు. ఆ క్యాసెట్టు ను మా ఇంట్లో అలాగే కారులో ప్లే చేసుకుని సంతోషించే వాళ్ళం. ఆ అనుభూతులు భలే హాయినిచ్చేవి. ఆ తర్వాత సిడీ లేని ఉత్త కవర్ ఇచ్చి ఫోటో కి ఫోటో ఇమ్మనేవారు. ఆ తర్వాత ఆడియో వేడుకలు లేకుండా పోయాయి. ఇక ప్లాటినం డిస్క్ ఫంక్షన్స్ లో ముందు షీల్డును అందజేసి వెనుక నుండి తీసుకునే వారు. ఇక రాను రాను బోకే లు ఇవ్వడం అవి కూడా మళ్ళీ తీసేసుకోవడం చేస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత మళ్ళీ డిస్కులు ఇస్తుంటే నిర్మాతను రాగానే ఏవండీ ఇది తీసుకునే డిస్కా ? తీసేసుకునే డిస్కా అని అడిగాను" అంటూ ప్రస్తుతం సినిమా వేడుకల్లో వచ్చిన మార్పులను చెప్పుకుంటూ వచ్చాడు. దీంతో అక్కడ ఉన్న వారు అనంత్ మాటలకు కాసేపు నవ్వుకున్నా నిజమే కదా ఎంత మార్పు వచ్చిందో అనుకున్నారు.