Begin typing your search above and press return to search.

ఆ పోస్టర్ వెనుక అంత కథ ఉంది

By:  Tupaki Desk   |   29 July 2017 5:40 AM GMT
ఆ పోస్టర్ వెనుక అంత కథ ఉంది
X
తెలుగులో పూర్తి హారర్ సినిమాలు అతి తక్కువగా వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు హారర్ సినిమాలు కొంచెం పెరిగాయి అనే చెప్పాలి. అంటే పూర్తి హారర్ సినిమాలుగా కాకపోయినా కొంచం మన తెలుగు కామిడీ జతచేసి నిర్మిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో 'ఆనందో బ్రహ్మ' అనే సినిమా కూడా వస్తోంది. ఈ మధ్యనే ఒక ఫస్ట్ లుక్ అండ్ టీజర్ విడుదల చేసి ఆసక్తి పెంచారు ఆ చిత్ర టీమ్. ఈ సందర్భంగా ఆ టీమ్ ఈ సినిమా పోస్టర్ గురించి ఒక ఆసక్తికర విషయం చెప్పింది.

ఈ సినిమా పోస్టర్ చూస్తే ఒక అద్దంలో ఒక ఇల్లు ఆ ఇంటిలో ఒక పాప.. చందమామను చూపిస్తుంది ద్వారం దగ్గర కొంతమంది బయపడుతునట్లు కనిపిస్తారు. ఈ అద్దం ఫ్రేమ్ చుట్టూ ముఖ్య తారాగణం ఉంటారు. మోషన్ పోస్టర్ చూస్తే.. ముందు ఒక ఇంటిలో నుండి కెమెరా వెనకకు వస్తుంది. అలా బయటకు వస్తున్నప్పుడు మనం చూస్తున్నది అద్దంలో ఇమేజ్ అని తెలుస్తుంది అప్పుడు ఆ అద్దం పగిలిపోతునట్లు వినిపిస్తుంది. అలా కొన్ని క్షణాల లోనే అద్దం కొంచెం అటు ఇటు ఊగుతూ కనిపిస్తుంది. ఇలా చేయడం వలన సినిమాలో అద్దంలోని రియాల్టీ.. రియాల్టీలోని ఆ మిర్రర్ కథ.. జనాలకు బాగా కనక్ట్ అయ్యిందట. అలాగే సినిమా థియేట్రికల్ ట్రైలర్ కోసమే ఒక కథ రాశాడట డైరక్టర్. ఈ పోస్టర్ తోనే అందులో ఉన్న ప్రతీ పాత్రను పరిచయం చేసి వాళ్ళ ఎలా ఉండబోతున్నారో చిన్న హింట్ కూడా ఇచ్చి.. ట్రైలర్లో వాటిని పూర్తిగా చూపించా అంటున్నాడు డైరక్టర్ మహి రాఘవ్.చెప్పాడు.”

ఆనందో బ్రహ్మ సినిమా ఆగష్టు 18 నాడు విడుదలకాబోతుంది. ఈ సినిమా ద్వారా తాప్సీ పన్ను మళ్ళీ తెలుగులో రీఎంట్రీ ఇస్తుంది. వెన్నల కిశోర్ - శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాలో ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. వీళ్లందరికీ కూడా ఇప్పుడు ఈ హారర్ కామెడి ఎంతవరకు బ్రేక్ ఇస్తుందో చూడాలి.