Begin typing your search above and press return to search.

సోడాల శ్రీదేవి తల్లి కాబోతోందా..?

By:  Tupaki Desk   |   31 Aug 2021 11:22 AM IST
సోడాల శ్రీదేవి తల్లి కాబోతోందా..?
X
తెలంగాణ వరంగల్ అమ్మాయి ఆనంది తెలుగులో కంటే తమిళంలో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. 'ఈ రోజుల్లో' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆనంది.. 'బస్ స్టాప్' 'నాయక్' వంటి చిత్రాల్లో నటించిన తర్వాత కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తమిళ నాట స్టార్ స్టేటస్ అందుకుని అక్కడ వరుస సినిమాలు - వెబ్ సిరీస్ లతో బిజీగా మారిపోయింది. దీంతో మరోసారి తెలుగు దర్శకనిర్మాతల చూపు ఆనంది పై పడింది. యువ హీరో తేజ సజ్జా డెబ్యూ మూవీ 'జాంబీ రెడ్డి' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

ఈ క్రమంలో లేటెస్టుగా సుధీర్ బాబు - డైరెక్టర్ కరుణ కుమార్ కాంబినేషన్ లో రూపొందిన 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి వారు కూడా ఆనంది పెర్ఫార్మన్స్ ని మెచ్చుకున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ లో ఆమె పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.

'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా ప్రమోషన్స్ లో ఆనంది కనిపించకపోవడానికి వేరే బలమైన కారణం ఉందని తెలుస్తోంది. ఆమె ఇప్పుడు గర్భవతిగా ఉండటం వల్లనే బయటకు రాలేదని టాక్ నడుస్తోంది. కోలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ ను ప్రేమించిన ఆనంది.. పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జనవరి 7న వరంగల్ లో నిరాడంబరంగా వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె గర్భం దాల్చినట్లు.. ఆరో నెల నడుస్తుండటంతో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.