Begin typing your search above and press return to search.

పవన్ చెల్లెలవుతానంది.. చేసేశారు

By:  Tupaki Desk   |   12 Nov 2016 1:30 PM GMT
పవన్ చెల్లెలవుతానంది.. చేసేశారు
X
హీరోయిన్లు ఎవరైనా పవన్ కళ్యాణ్ పక్కన కథానాయికగా నటించాలని అనుకుంటారు. కానీ తెలుగమ్మాయి రక్షిత అలియాస్ ఆనంది మాత్రం ఆయనకు చెల్లెలిగా నటించాలనుందంటూ చిత్రమైన కోరిక కోరింది. ఆమె ఇలా అడగడం ఆలస్యం.. ఆ కోరికను మన్నించేశాడు పవన్ కళ్యాణ్. అవును.. పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమాలో ఆనంది ఆయనకు చెల్లెలిగా నటించబోతోంది. బహుశా ఈ సంగతి ముందే తెలిసే.. తనతో సంప్రదింపులు జరుపుతుండగానే ఆనంది ఈ కోరికను మీడియాతో చెప్పిందో ఏమో కానీ.. తమిళ దర్శకుడు ఆర్.టి.నీశన్ దర్శకత్వంలో పవన్ నటించే సినిమాలో ఆనంది ఆయన చెల్లెలి పాత్ర పోషించడం మాత్రం కన్ఫమ్ అయింది.

పవన్-నీశన్ కాంబినేషన్లో రాబోయేది తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాలం’కు రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాలో హీరో చెల్లెలి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ సినిమా కథ చెల్లెలి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కథలో ఎంతో కీలకమైన ఆ పాత్రకు ఆనంది ఎంపికవడం విశేషమే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు. ఆ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ పేరు పరిశీలిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. పవన్ ఇంతకుముందు చెల్లెలి సెంటిమెంటు నేపథ్యంలో ‘అన్నవరం’ సినిమా చేశాడు. అది మంచి ఫలితాన్నివ్వలేదు. మరి ఈసారి సిస్టర్ సెంటిమెంట్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/