Begin typing your search above and press return to search.

ప్రేమికుడుకి ప్రేయసి దొరకడం లేదు

By:  Tupaki Desk   |   25 May 2017 11:51 AM GMT
ప్రేమికుడుకి ప్రేయసి దొరకడం లేదు
X
‘తను వెడ్స్ మను’ సినిమాతో బాలీవుడ్ కు మరో ప్రేమకథకుడు దొరికాడు. అతనే ఆనంద్ ఎల్ రాయ్. ఆనంద్ ఇప్పటివరకు కొంచం చిన్న స్టార్స్ తో వర్క్ చేశారు. అతని ప్రేమ కథలు ​చాల కాంప్లికేటెడ్ గా ఉంటాయి అందుకనేమో మరి. అలాంటి దర్శకుడు చేతిలో ప్రేమ రాకుమారుడు కింగ్ ఆఫ్ రొమాన్స్ షారుక్ ఖాన్ పడితే ఎంత ఘాటుగా ఉంటుందో కదూ. ఇక్కడ అదే జరిగింది​. ​

కాకపోతే ఈ సినిమా కాస్టింగ్ ఇప్పుడు పెద్ద కత్తి మీద సాము లెక్క అయ్యింది. షారుక్ ఖాన్ కు జోడీగా మొదట దీపికా పడుకొనే అనుకున్నారు. కానీ దీపిక డేట్స్ కుదరక ఈ సినిమాను వదులుకోవలిసి వచ్చింది. వెంటేనే ఆనంద్ టీమ్ ఆలీయా బట్ ను సంప్రదించారు. ఈ పాత్ర నిడివి తక్కువే అయినా చాలా కాలం గుర్తించుకో తగినది అంటున్నారు సన్నిహితులు. అయినా కానీ ఇప్పుడు ఆలీయా కూడా ఈ ప్రాజెక్టు చేసేట్లు కనిపించటంలేదు. తన డేట్స్ కూడా కావలిసినన్ని రోజులు లేక పోవడంతో షారుక్ ప్రాజెక్టు నుండి తప్పుకుందట.

ఫిల్మ్ ప్రాజెక్టు సంభందించిన వారు మాటలు బట్టి ఈ ఫలానా పాత్రకు ప్రిపేర్ కావడానికి టైమ్ పడుతుందని.. ఇప్పటివరకు ఆనంద్ ఎల్ రాయ్ రాసిన పాత్రలలో ఇది చాలా క్లిష్టమైనది అని తెలుస్తోంది. అందుకనే ఈ పాత్ర కోసం కాస్ట్ చేయడం కష్టం అవుతోందట. ఇప్పటికే మరో లీడ్ రోల్ కు కత్రినా కైఫ్ ను ఎన్నుకున్నారు. ఇప్పుడు చెప్పండి ఆ హీరోయిన్ పాత్రకు ఎవరైతే బాగుంటుందో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/