Begin typing your search above and press return to search.

జీరో లెక్కను ధనుష్ సరిచేస్తాడా

By:  Tupaki Desk   |   6 Jun 2019 7:14 AM GMT
జీరో లెక్కను ధనుష్ సరిచేస్తాడా
X
గత ఏడాది దారుణమైన డిజాస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన జీరో దెబ్బకు షారుఖ్ ఖాన్ ఏకంగా ఆరు నెలలకు పైగా గ్యాప్ తీసుకుని ఖాళీగా ఉన్నాడు. టైటిల్ ని సార్ధకం చేస్తూ రిజల్ట్ అందుకోవడం అభిమానులను సైతం షాక్ కి గురి చేసింది. ఇక దీని దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ పరిస్థితి గురించి చెప్పేదేముంది. దీని దెబ్బకు ఇతర స్టార్లు ఈయన పేరు చెబితేనే తర్వాత చూద్దాం అంటున్నారు . అలా అని ఈయనేమి తీసిపారేసే డైరెక్టర్ కాదు.

తను వెడ్స్ మను లాంటి బ్లాక్ బస్టర్ తో కంగనాకు లైఫ్ ఇచ్చింది ఈయనే. దాని సీక్వెల్ తో కూడా అదే స్థాయి హిట్టు కొట్టడం ఆయనకే చెల్లింది. అయినా పరిశ్రమలో సక్సెస్ తర్వాతే ఏదైనా కాబట్టి ఇప్పుడీ ఆనంద్ ఎల్ రాయ్ డ్యామేజ్ రిపీర్ కు పూనుకున్నాడు. అక్కడ స్టార్లు మొహం చాటేస్తున్నారు కాబట్టి ఈసారి సౌత్ హీరోని పట్టాడు

ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో ఓ సినిమా రూపొందనుంది. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ రాన్ జనా సూపర్ హిట్ అవ్వడమే కాక ధనుష్ కు హిందిలో సైతం గుర్తింపు ఇచ్చింది. అదే ఉత్సాహంతో వేరే దర్శకుడితో శమితాబ్ చేశాడు కాని ఫ్లాప్ అయ్యింది. మళ్ళి ఇంత గ్యాప్ తర్వాత తనకు బ్రేక్ ఇచ్చిన ఆనంద్ ఎల్ రాయ్ తో మరో ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు.

ఇది స్వయంగా ధనుష్ ప్రకటించడంతో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం వెట్రిమారన్ తో అసురన్ చేస్తున్న ధనుష్ కు గత ఏడాది వడ చెన్నై మారి 2 తమిళ్ లో కమర్షియల్ గా సక్సెస్ కొట్టాయి. ఒకటి తెలుగు డబ్ చేయలేదు రెండోది ఆడలేదు. ఈసారి మాత్రం ఆనంద్ ఎల్ రాయ్ సినిమా మల్టీ లాంగ్వేజ్ ప్లాన్ చేస్తారట. కాకపోతే జీరో చేసిన లాస్ ని ధనుష్ తో పూడ్చుకోవాలని చూస్తున్న ఆనంద్ ఎల్ రాయ్ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి