Begin typing your search above and press return to search.

నేను సినిమాల్లోకి వస్తానంటే అన్నయ్య అన్నమాట అదే!

By:  Tupaki Desk   |   8 Nov 2021 3:43 AM GMT
నేను సినిమాల్లోకి వస్తానంటే అన్నయ్య అన్నమాట అదే!
X
ఈ మధ్య కాలంలో కొత్త కాన్సెప్టులు పట్టుకుని యువ దర్శకులు రంగంలోకి దిగిపోతున్నారు. జయాపజయాల సంగతి అటుంచితే, కొత్తగా ప్రయోగాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలా దామోదర అనే దర్శకుడు 'పుష్పక విమానం' అనే సినిమా చేశాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకి విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను హీరోను అయినట్టుగా ఎలివేషన్ ఇస్తున్నారు .. కానీ నేను అసలు హీరోనే కాదు. పద్ధతిగా .. హానెస్ట్ గా .. ఇన్నోసెంట్ గా బ్రతికే మనిషిని నేను .. నా పేరు చిట్టిలంక సుందర్. నేను ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ ని. ఉద్యోగం వచ్చింది .. నెలకి జీతం వస్తోంది .. అందువలన పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. పెళ్లి లైఫ్ ను ఎంతగానో ఊహించుకున్నాను.

కానీ నా పెళ్లాం లేచిపోయింది భయ్యా .. ఇప్పుడు ఏం చేయాలి?. అసలు ఎక్కడికి వెళ్లింది? ఎవరితో వెళ్లింది? ఏమైపోయింది? అనే ప్రశ్నలు మీకే కాదు నాకు వచ్చాయి. ఇంత తతంగం జరిగే ఈ సినిమా నుంచి ఒక మంచి మెసేజ్ ఉంటుంది. సింపుల్ గా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చుతుంది. నేను .. దామోదర ఈ సినిమాను మొదలుపెట్టేటప్పుడు ఒక కాన్సెప్ట్ ఫిల్మ్ లానే అనుకున్నాము. ఈ ప్రొడక్షన్ లోకి విజయ్ జాయిన్ అయిన తరువాత సినిమా లెవెల్ మారిపోయింది.
ఈ సినిమాకి మా ఫాదర్ కూడా ఒక పార్ట్నర్ .. కానీ ఆయన ఇక్కడికి రాలేదు. మమ్మల్ని టీవీలో చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు.

నిజానికి మా నాన్న యాక్టర్ కావాలనుకునే ఒక ఎర్రబస్సు ఎక్కి ఇక్కడికి వచ్చాడు. కొన్ని కారణాల వలన ఆయన యాక్టర్ కాలేకపోయారు. కానీ ఈ రోజున మా అన్నయ్య .. నేను యాక్టర్స్ కావడం ఆయనకి చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. మా పేరెంట్స్ మాకు చిన్నప్పటి నుంచి ఫ్రీడమ్ ఇచ్చారు. 'మీరు ఏమనుకుంటున్నారో అదే చేయండి' అని చెప్పేవారు. అందువల్లనే నేను కూడా యాక్టింగ్ వైవు వచ్చేశాను. నా వెనక మా అన్నయ్యతో పాటు మా పేరెంట్స్ కూడా ఉన్నారు.

మా అన్న .. నేను బ్రదర్స్ లా కాకుండా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటాము. నేను కూడా సినిమాల్లోకి వద్దామని అనుకుంటున్నట్ట్టుగా ఒక రోజున మా అన్నయ్యకి చెప్పాను. "అలా అయితే అన్ని వ్యవహారాలు నువ్వే చేసుకోవాలి .. నేను చేయిపట్టుకుని తీసుకుని వెళ్లడం అలవాటు చేస్తే నువ్వు ఎంతో దూరం వెళ్లలేవు" అన్నాడు. ఎవరో వచ్చి అవకాశాలు ఇవ్వరు .. నువ్వే వెళ్లి తెచ్చుకోవాలి అని చెప్పాడు. అలాగే కొత్తవాళ్లకి తాను ఎన్నో అవకా శాలు ఇస్తున్నాడు. ఈ నెల 12న థియేటర్స్ కి వెళ్లండి .. హ్యాపీగా ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చాడు.