Begin typing your search above and press return to search.

త‌మ్ముడు కొండ కోసం 96 బ్యూటీ

By:  Tupaki Desk   |   24 Sep 2019 5:30 PM GMT
త‌మ్ముడు కొండ కోసం 96 బ్యూటీ
X
ప్ర‌తిభ ఉంటే ఆర్టిస్టు జోరు గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. అయితే న‌టించిన ప్ర‌తి సినిమాకి ప‌రిణ‌తి చెంది పూర్తి స్థాయిలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే లాంగ్ స్టాండింగ్ సాధ్యం. ఇండ‌స్ట్రీలోకి ఎంద‌రో న‌టీన‌టులు వ‌స్తున్నారు.. వెళుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో ఎవ‌రో ఒక‌రు ఉండి క‌థ న‌డిపిస్తే కొంత‌కాలం నిల‌దొక్కుకోగ‌లుగుతున్నారు. లేదంటే ఒక్క ఫెయిల్యూర్ తోనే బ్యాక్ టు ద పెవిలియ‌న్ అనే ప‌రిస్థితి కూడా ఉంటోంది.

అయితే ఈ గండాల‌న్నిటి నుంచి ఆనంద్ దేవ‌ర‌కొండ‌ త‌న‌ని తాను నిల‌బెట్టుకుంటాడా? లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రం. అన్న విజ‌య్ దేవ‌ర‌కొండ పెద్ద స్టార్ గా త‌న‌ని తాను నిల‌బెట్టుకుంటున్నాడు. స్వ‌యంకృషితో ఎదిగిన హీరోగా గుర్తింపు ఉంది. ఆ క్రేజు సోద‌రుడికి ఎంతో కాలం క‌లిసి రాదు. త‌న‌కంటూ ఒక మార్క్ ఉంద‌ని నిరూపించుకుంటేనే ఇక్క‌డ ముందుకెళ్ల‌డం సాధ్యం. ఆనంద్ దేవ‌ర‌కొండ `దొర‌సాని` అనే నాయికా ప్ర‌ధాన చిత్రంతో తెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఇప్ప‌టికి వ‌న్ ఫిలిం కిడ్. మునుముందు చాలానే సాధించాల్సి ఉంటుంది. ఆ క్ర‌మంలోనే త‌న కెరీర్ రెండో సినిమాని ప‌ట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈసారి భ‌వ్య క్రియేష‌న్స్ లాంటి స్ట్రాంగ్ బేస్ ఉన్న సంస్థ‌లోనే న‌టిస్తున్నాడు. ఈ చిత్రంతో వినోద్ అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్ప‌టికే న‌టీన‌టుల ఎంపిక స‌హా ప్రీప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. తాజాగా ఆనంద్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా 96 చిత్రంలో ఫోటోగ్రాఫ‌ర్ పాత్ర పోషించిన వ‌ర్షా బొల్లామ్ ని క‌థానాయిక‌గా ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన‌ ఇత‌ర‌త్రా వివ‌రాలు తెలియాల్సి ఉందింకా.