Begin typing your search above and press return to search.

దేవరకొండ తమ్ముడు రెండో సినిమాకి రెడీ !

By:  Tupaki Desk   |   2 Sep 2019 5:49 AM GMT
దేవరకొండ తమ్ముడు రెండో సినిమాకి రెడీ !
X
'దొరసాని' హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్. అయితే ఈ సినిమాతో హీరోగా విజయం అందుకుంటాడాని ఊహించిన ప్రేక్షకులకు షాక్ ఇచ్ఛాడు ఆనంద్. రిలీజ్ కి ముందు విజయ్ రంగంలోకి దిగి మరీ సినిమాను గట్టిగా మోసాడు. మేకర్స్ కూడా ఓ గొప్ప సినిమా తీసామని చెప్పుకున్నారు. అయితే 'దొరసాని' స మొదటి షో తోనే నెగిటీవ్ టాక్ అందుకొని చతికిల పడింది.

మొదటి సినిమా ఆశించిన ఫలితం అందివ్వకపోవడంతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న ఆనంద్ ఇప్పుడు రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు. దొరసాని చేస్తున్న టైంలోనే వినోద్ అనే దర్శకుడితో సినిమా ఫైనల్ చేసుకున్న చిన్న దేవరకొండ ఇప్పుడు ఆ సినిమాతో సెట్స్ పైకి రానున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఒక కుర్రాడు చేసే వ్యాపారం అందులో వచ్చిన ఇబ్బందులతో సినిమా తెరకెక్కనుంది సమాచారం. సెప్టెంబర్ రెండో వారంలో సైలెంట్ గా షూట్ మొదలుపెట్టనున్నారని తెలుస్తుంది.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు వర్ష బొల్లమ్మ అనే తమిళ్ హీరోయిన్ ని ఫైనల్ చేసుకున్నారు. వర్ష కి తెలుగులో ఇది రెండో సినిమా. ప్రస్తుతం శివ కందుకూరి హీరోగా పరిచయమవుతున్న 'చూసి చూడంగానే' సినిమాలో నటిస్తుంది. మరి ఈ సినిమాతో అయినా ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి హిట్ అందుకుంటాడో చూడాలి.