Begin typing your search above and press return to search.

రౌడీ అన్న క‌ష్టంపై త‌మ్ముడి ఎమోష‌న్

By:  Tupaki Desk   |   1 July 2019 10:36 AM GMT
రౌడీ అన్న క‌ష్టంపై త‌మ్ముడి ఎమోష‌న్
X
న‌ట‌వార‌సులు వెల్లువెత్తుతున్న సీజ‌న్ ఇది. బాలీవుడ్ టాలీవుడ్ అన్నిచోట్లా ఇదే స‌న్నివేశం క‌నిపిస్తోంది. టాలీవుడ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. అలాగే జీవిత‌- రాజ‌శేఖ‌ర్ జంట గారాల ప‌ట్టీ శివాత్మిక క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. ఆనంద్ - శివాత్మిక జంట‌గా న‌టించిన `దొర‌సాని` ఈనెల 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. మ‌హేంద్ర దర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ - బిగ్ బెన్ సినిమాస్- మ‌ధుర ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్న చాటు త‌మ్ముడిగా ఆనంద్.. జీవిత వార‌సురాలిగా శివాత్మిక‌ ఏమేర‌కు మెప్పిస్తారో చూడాల‌న్న ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది. అన్నిటికీ జూలై 12 స‌మాధానం చెబుతుంద‌ని రౌడీ కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. నేడు హైద‌రాబాద్ లో జ‌రిగిన దొర‌సాని ట్రైల‌ర్ ఈవెంట్ లో ఆనంద్ స్పీచ్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది.

ఆనంద్ మాట్లాడుతూ.. ``చాలా మంది మీడియా నుంచి వ‌చ్చి నా తొలి పోస్ట‌ర్ ని చూశారు. ప్ర‌శంసించారు. అదే నాపై నాకు న‌మ్మ‌కం పెంచింది. నాలుగేళ్ల క్రితం అమెరికాలో ఉన్నాను. మాస్ట‌ర్స్ అయిపోయాక జాబ్ చేస్తున్నా. ఓ రోజు ఆఫీస్ కి వెళ్ల‌లేదు. ల్యాప్ టాప్ ఓపెన్ చేసి చూస్తుంటే.. ఆరోజు పెళ్లి చూపులు ట్రైల‌ర్ లాంచ్ అవుతోంది. స్టేజీపైన విజ‌య్‌ మాట్లాడుతుంటే చూశాను. ప‌దేళ్లు థియేట‌ర్ స్టేజీ కి న‌టిస్తూ.. హీరో అయ్యాడు.. అటుపై స‌క్సెస‌వ్వ‌డం మామూలు విష‌యం కాదు. అది ఎంతో గ‌ర్వాన్నిచ్చింది. జోయ్ నిచ్చింది. అన్న‌ అంత క‌ష్ట‌ప‌డితే వ‌చ్చిన అవ‌కాశం `పెళ్లి చూపులు`. ఆరోజు రూమ్ లో ఒక్క‌డినే ఉన్నాను. క‌న్నీళ్లు వ‌చ్చేశాయి. నేను ఒక్క‌డినే ఉన్నాను కాబ‌ట్టి ఎవ‌రితోనూ షేర్ చేసుకోలేక‌పోయాను. ఈరోజు డెబ్యూ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నందుకు అంతే ఎమోష‌న‌ల్ గా .. సంతోషంగా ఉంది`` అని కాస్తంత ఉద్వేగంగానే మాట్లాడారు.

ఒకే సినిమాలో న‌ట‌వార‌సుల రాక గురించి ఆనంద్ త‌న‌దైన శైలిలో క్లారిటీనిచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ``దొర‌సాని కాస్టింగ్ ప్లాన్ చేసి చేయ‌లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు అని.. శివాత్మిక జీవిత రాజ‌శేఖ‌ర్ వార‌సురాలు అని ప్లాన్ చేసి.. సెట‌ప్ చేసి.. చేస్తున్నార‌ని అనుకోవ‌చ్చు. కానీ అలా కుద‌ర‌దు. ఇదిగో ఇక్క‌డ ఉన్న ద‌ర్శ‌కుడి ప్లాన్ వ‌ల్ల అయ్యింది. మ‌హేంద్ర ఒక జీనియ‌స్ డైరెక్ట‌ర్. ఆ సంగ‌తి సినిమా రిలీజ్ త‌ర్వాత తెలుస్తుంది. జూలై 12న సినిమా చూసి చెప్పండి. అంద‌రూ కొత్త‌వాళ్ల‌తో అద్భుతంగా తీశారు`` అని తెలిపారు. న‌న్ను విజ‌య్ లాంచ్ చేశాడు. శివాత్మిక‌ను జీవిత లాంచ్ చేశారు. ఇలాంటి స్పెక్యులేష‌న్స్ ఏవీ పెట్టుకోవ‌ద్దు. సినిమాని సినిమాగా చూడండి.. అని అన్నారు. స్పీచ్ అంతా బాగానే ఉంది కానీ.. అన్న పేరు నిల‌బెడ‌తావా త‌మ్ముడూ? అన్నిటికీ ఆరోజే స‌మాధానం అంటావా!!