Begin typing your search above and press return to search.

రెండో దేవరకొండకు రంగం సిద్ధం

By:  Tupaki Desk   |   28 Sep 2018 9:57 AM GMT
రెండో దేవరకొండకు రంగం సిద్ధం
X
'అర్జున్ రెడ్డి తో యూత్ లో క్రేజీ ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో స్టార్డం పీక్స్ కు చేరింది. విజయ్ డేట్స్ మరో మూడు నాలుగేళ్ళ వరకూ దొరికే పరిస్థితి లేదంటేనే మనం విజయ్ రేంజ్ ని అర్థం చేసుకోవచ్చు. ఇక విజయ్ తన తమ్ముడు ఆనంద్ ను హీరో గా పరిచయం చేస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ డెబ్యూ ఫిలిం పై మరో అప్డేట్ వచ్చింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ హీరో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక నటిస్తుందట. శివాత్మిక కు ఇదే హీరోయిన్ గా డెబ్యూ ఫిలిం అవుతుంది. ఇక ఈ సినిమా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. పలు షార్ట్ ఫిలిమ్స్ కు దర్శకుడిగా మహేంద్ర మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తో టాలీవుడ్ లో తన లక్ ను టెస్ట్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమాను యాష్ రంగినేని - మధుర శ్రీధర్ లు కలిసి నిర్మిస్తున్నారు. సురేష్ బాబు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తారు.

ఈ సినిమా కథ తెలంగాణా నేపథ్యంలోనే సాగుతుందని సమాచారం. అక్టోబర్ 10 వ తారీఖున ఈ సినిమాను లాంచ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అన్నయ్య లాగానే ఆనంద్ కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో వేచి చూడాలి.