Begin typing your search above and press return to search.

దేశంలో కరోనాకు కారణం చెప్పిన దేవరకొండ

By:  Tupaki Desk   |   30 March 2020 11:10 AM GMT
దేశంలో కరోనాకు కారణం చెప్పిన దేవరకొండ
X
కరోనా రక్కసి ప్రపంచాన్ని గుప్పిట పట్టి వందలాది మంది ప్రాణాలు తీస్తోంది. యూరప్ - అమెరికా సహా గల్ఫ్ దేశాల్లో మరణ మృదంగం వినిపిస్తోంది. ఈ కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమైన చైనాను ఇప్పుడు అందరూ తిట్టిపోస్తున్నారు. ఈ మహమ్మారి చైనా నుంచే ప్రపంచానికి సోకడంపై ఆ దేశాన్ని వేలేత్తి చూపిస్తున్నారు.

అయితే తాజాగా మరో విషయం బయటపడింది. కరోనా వైరస్ మానవుడి నుంచి మానవుడికి వ్యాప్తి చెందుతుందని చైనాకు ముందే తెలుసు అని.. వూహాన్ లో వెలుగుచూశాక 7 మిలియన్ల మంది వివిధ ప్రాంతాలకు దేశాలకు చైనా విడిచిపెట్టిందని ఇయాన్ బ్రెమ్మర్ అనే వ్యక్తి తాజాగా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసిన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఘాటుగా స్పందించాడు.

మనం కరోనాతో లాక్ డౌన్ లో ఉండడానికి.. ఇంత మంది చనిపోవడానికి చైనా నిర్లక్ష్యం - కుట్రనే కారణమని.. ఈ స్థితికి ఖచ్చితంగా చైనాదే బాధ్యత అని ఆనంద్ దేవరకొండ ట్వీట్ లో మండిపడ్డారు. వూహాన్ నుంచి 7 మిలియన్ల మందిని చైనా వదిలేసిందని.. వారే ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రబలడానికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ ప్రబలడానికి చైైనానే కారణం అన్న ప్రామాణికత గురించి ఎవరికీ తెలియదు - కాని కుట్ర సిద్ధాంతాలు బయటపడ్డాక చైనాను నిందిస్తూనే ఉన్నారు.