Begin typing your search above and press return to search.

'హైవే' అనే క్రైమ్ థ్రిల్లర్ లో ఆనంద్ దేవరకొండ..!

By:  Tupaki Desk   |   6 May 2021 12:30 PM GMT
హైవే అనే క్రైమ్ థ్రిల్లర్ లో ఆనంద్ దేవరకొండ..!
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 'దొరసాని' సినిమాతో పరిచయమైన ఆనంద్.. ఆ తర్వాత వచ్చిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్‌' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హోమ్ బ్యానర్ లో నటించిన 'పుష్పక విమానం' అనే కామెడీ ఎంటర్టైనర్ ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న ఆనంద్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా మూడు ప్రాజెక్ట్స్ ని ప్రకటించాడు. ఈ క్రమంలో యువ హీరో తాజాగా మరో కొత్త సినిమాని ప్రారంభించాడు.

తెలుగులో '118' 'www' వంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో ''హైవే'' అనే చిత్రంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈరోజు గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాని స్టార్ట్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే గడారి కిషోర్ కుమార్ క్లాప్ కొట్టగా.. డైరెక్టర్ వీరభద్రం చౌదరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఇదొక ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. దీనికి సైమన్ కె.కింగ్ సంగీతం సమకూర్చనున్నారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'హైవే' చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇకపోతే ఆనంద్ దేవరకొండ ఇప్పటికే మధురా ఎంటర్టైన్మెంట్స్ - రోల్ కెమెరా విజువల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. అలానే హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో కేదార్ సెలగం శెట్టి - వంశీ కారుమంచి కలిసి నిర్మించే సినిమా.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయనున్నాడు. మొత్తం మీద ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకొని దేవరకొండ బ్రదర్ ఫుల్ జోష్ లో ఉన్నాడని చెప్పవచ్చు.